బాపట్ల : పర్చూరులో వైసీపీ నుంచి తాను పోటీ చేసి గెలవకపోవడమే మంచిదైందని
దగ్గుబాటి వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. గెలిచి ఉంటే రోడ్లు వేయలేదని
ప్రజలు తనని నిలదీసేవారన్నారు. సోమవారం కారంచేడులో స్థానికులతో ఆయన మాటామంతీ
నిర్వహించారు. వైసీపీ పాలనలో కారంచేడులో ఒక్క రోడ్డు మరమ్మతు కూడా చేయలేదు.
ఎమ్మెల్యేగా గెలిచి ఉంటే ఈ రోడ్లపై ఇంత స్వేచ్ఛగా తిరిగే వాడిని కాదు. దేవుడి
దయ వల్ల పర్చూరులో నేను ఓడిపోవడం మంచిదైంది. నా కుమారుడిని ఎమ్మెల్సీ చేసి
మంత్రి పదవి ఇస్తామన్నారు. జగన్ పెట్టిన నిబంధనలకు తలొగ్గలేక సున్నితంగా
తిరస్కరించాం. రాజకీయాలంటే పరస్పర విమర్శలు. నేతలు తిట్టుకోవడమే తప్ప ప్రజలకు
ఒరిగిందేమీ లేదని దగ్గుబాటి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.