అనంతపురం : ‘ఆడుదాం ఆంధ్ర’ అంటూ వైఎస్సార్సీపీ ప్రభుత్వం జనాల జీవితాలతో
ఆటలాడుతోందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతపురం జిల్లాలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఈ మేరకు
వ్యాఖ్యానించారు. ఆటల మాటున నిధుల దోపిడీకి కుట్ర పన్నారని ఆరోపించారు. దేశంలో
అన్ని రాష్ట్రాలు అభివృద్ధిలో దూసుకుపోతుంటే జగన్ మాత్రం ఏపీని మాయ మాటలతో
నడుపుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి హయాంలో రైతుల
పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. ఈ క్రమంలో ప్రజలను హింసిస్తున్న సీఎం
జగన్‌కు క్రిస్మస్ శుభాకాంక్షలు అంటూ చురకలు అంటించారు. క్రీస్తు బోధనలతోనైనా
జగన్‌లో మార్పురావాలని సత్యకుమార్ అన్నారు.