ఏలూరు : కేంద్రం ఇచ్చిన నిధులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత పథకాలకు
వాడుకున్నారని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ, ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర
అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. గత ఐదేళ్లలో ఉపాధి హామీ కింద
కేంద్రం రూ. 36వేల కోట్లు ఇచ్చిందని గుర్తుచేశారు. ఏలూరులో నిర్వహించిన మీడియా
సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం ఇచ్చే నిధులను మళ్లించడంతో గ్రామాల
అభివృద్ధి కుంటుపడింది. రాజ్యాంగబద్ధంగా రావాల్సిన నిధులు కూడా రాష్ట్రం
ఇవ్వలేదు. పేదలకు చెందాల్సిన నిధులువైసీపీ నేతల జేబుల్లోకి వెళ్తున్నాయి.
దీనికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, ఉద్యమాలు చేస్తున్నాం. ఢిల్లీ
వెళ్లి పిర్యాదు చేసినా చర్యల్లేవని, కేంద్ర ఆర్థికశాఖ స్పందించలేదని వైవీబీ
రాజేంద్రప్రసాద్ తెలిపారు.