పులివెందులలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్మోహన్ రెడ్డి, కుటుంబ
సభ్యులు
వైఎస్సార్ జిల్లా వక్ఫ్ బోర్డు ఛైర్మన్ దస్తగిరి కుమారుడు, కుమార్తెల వివాహ
వేడుకలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్
వైఎస్ఆర్ జిల్లా పులివెందుల : క్రిస్మస్ పర్వదినం సందర్భంగా సీఎం జగన్ మోహన్
రెడ్డి సోమవారం పులివెందులలోని సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో
పాల్గొన్నారు. క్రిస్మస్ వేడుకల్లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో పాటు
కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు. సీఎస్ఐ చర్చిలో ప్రార్థనల
అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్
పండగ శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ సభ్యులతో కలిసి క్రిస్మస్ పండుగ ప్రత్యేక
ప్రార్థనల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇక్కడికి
విచ్చేసిన బందువర్గానికి, స్నేహితులు, ఆప్తులు, అభిమానులకు క్రిస్మస్ పర్వదిన
శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఇక్కడికి విచ్చేసిన అందరికీ క్రిస్మస్
పర్వదిన శుభాకాంక్షలతో పాటు ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ప్రతి ఏడాది ఈ క్రిస్మస్ పర్వదినం రోజున తన సొంత గడ్డపై కుటుంబ సభ్యులు,
బందుగణం, స్నేహితులతో కలిసి పండుగ వేడుకలో పాల్గొనడం తన మనసుకు ఎంతో
ఆనందాన్నిచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి
తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతి తో పాటు వైఎస్ ప్రకాష్ రెడ్డి,
ప్రకాష్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా,
జిల్లా ఇంచార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, జెడ్పి
చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, ఎమ్మెల్యే డా.డి.
సుధా, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు, జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్, పాడా
ఓఎస్డీ అనిల్ కుమార్ రెడ్డి, పలువురు జిల్లాస్థాయి అధికారులు, రెవెన్యూ,
పోలీసు శాఖల అధికారులు పాల్గొన్నారు.
మూడు రోజుల పర్యటనలో భాగంగా చివరి రోజు సోమవారం ఉదయం సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్
ప్రార్థనలు ముగించుకుని ఉదయం 11.15 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్
మోహన్ రెడ్డి బాకరాపురం హెలిప్యాడ్ చేరుకున్నారు. అంతకు ముందు చర్చి నుండి
రోడ్డు మార్గాన బయలుదేరిన ఆయన పట్టణంలోని గాయత్రీ కాలనీలో ఇటీవలే కుమారుని
వివాహం చేసిన వైఎస్ఆర్సిపి నాయకుడు నల్లచెరువుపల్లి రవి ఇంటికి వెళ్లి నూతన
దంపతులను ముఖ్యమంత్రి ఆశీర్వదించారు. అక్కడి నుంచి బయలుదేరిన ముఖ్యమంత్రి
భాకరాపురం హెలిప్యాడ్ వద్దకు చేరుకుని అక్కడ స్థానిక నాయకులతో మాట్లాడి ప్రజల
నుండి అర్జీలను స్వీకరించారు. అనంతరం హెలిప్యాడ్ నుండి బయలు దేరి జిల్లా
వక్ఫ్ బోర్డు చైర్మన్ దస్తగిరి నివాసంలో ఆయన కొడుకు, ఇద్దరు కూతుళ్ళ వివాహ
వేడుకలలో పాల్గొనేందుకు మైదుకూరుకు వెళ్లారు. మునిసిపల్ మునిసిపల్ చైర్మన్
వరప్రసాద్, వైస్ చైర్మన్ వైయస్ మనోహర్ రెడ్డి, పాడా ఓఎస్డి అనిల్ కుమార్
రెడ్డి, ఎస్పీ సిద్ధార్థ కౌశల్, ఆర్డీవో వెంకటేశ్వర్లు, స్థానిక ప్రజా
ప్రతినిధులు హెలిప్యాడ్ వద్ద ముఖ్యమంత్రికి వీడ్కోలు పలికారు.