మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్
గుంటూరు : వైసీపీ పాలనపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి
రాజేంద్రప్రసాద్ ధ్వజమెత్తారు. వచ్చే మూడు నెలల్లోనైనా ముఖ్యమంత్రి జగన్
నిజాయితీగా ఉండకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారన్నారు. గుంటూరులో నిర్వహించిన
మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీని జగన్ అప్పుల ఊబిలోకి నెట్టారని
విమర్శించారు. వైసీపీ పాలనకు చరమగీతం పాడేందుకే టీడీపీ -జనసేన పొత్తు.
తుపానుతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. జగన్ పరదాల
చాటున వచ్చి రైతులను పలకరించకుండానే వెళ్లారు. అంగన్వాడీ కేంద్రాలను
పట్టించుకున్న పాపాన పోలేదని ఆలపాటి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు.