విజయవాడ : కార్పొరేషన్ల ముసుగులో సీఎం జగన్‌రెడ్డి వేలాది కోట్ల రూపాయలు
దోపిడీ చేస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ఆరోపించారు.
ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక అరాచకం రాజ్యం
ఏలుతుందా అనే అంశంపై రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా
రుద్రరాజు మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో జరుగుతున్న
అరాచకాన్ని ఆపలేకపోయింది. రోశయ్య ఆర్థిక మంత్రిగా ఉండగా ఎఫ్ఆర్బీఎంను దాటి
వెళ్లకూడదని ఎప్పుడు చెప్పేవారు. 2005-2007 మధ్య ఏపీఎంఎస్డీసీ చైర్మన్‌గా కూడా
నేను పనిచేశాను. కార్పొరేషన్ల ముసుగులో వేలాది కోట్ల రూపాయలు దోపిడీ
చేస్తున్నారు. వేరే రాష్ట్రంలో అయితే కార్పొరేషన్లు వెల్పేర్ యాక్టివిటీలో
ఉంటే ఇక్కడ మాత్రం లెండింగ్ యాక్టివిటీలో ఉన్నాయి. పదిలక్షల కోట్లు మనపై ఉన్న
అప్పలు భారం. దీన్ని మోసే స్థాయిలో ఏపీ ప్రభుత్వం లేదు. కాంట్రాక్టర్లకు
బిల్లింగ్ లైక్స్ అండ్ డిస్ లైక్స్‌తో చేస్తే ఎలా.? పాత గవర్నమెంట్ పనులకు
బిల్లులు ఇవ్వను అంటే ఎలా.? 5 లక్షలు పనులకు కూడా నిబంధనల్లో కోర్టులకు వెళ్ల
కూడదని రాశారు. మరి సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెట్టినందుకు ఎన్ఆర్ఐను వచ్చి
రాగానే ఎందుకు జైల్లో పడేశారని గిడుగు రుద్రరాజు ప్రశ్నించారు.
[image: image.png]