సిఎం జగన్ పుంగనూరు పై ప్రత్యేక శ్రద్ద
30 ఏళ్ల అభివృద్ధి నాలుగేళ్లలో చేసి చూపించాం
మంత్రి డా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
రూ. 13 కోట్లతో నిర్మించిన భవనాలు, విద్యుత్ సబ్ స్టేషన్ల ను ప్రారంభించిన
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
చిత్తూరు : చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలో పలు
అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర విద్యుత్, అటవీ, శాస్త్ర,సాంకేతిక భూగర్భ
గనుల శాఖ మంత్రి డా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభోత్సవాలు చేశారు.
గ్రామసచివాలయాలు,రైతు భరోసా కేంద్రాలు, ఆర్ ఓ ప్లాంట్లు, వైయస్సార్ హెల్త్
సెంటర్ల లకు, విద్యుత్ సబ్ స్టేషన్ లను మంత్రిపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
ప్రారంభించారు. 14 పంచాయితీల్లో 28 ప్రదేశాలలోప్రారంభోత్సవాలు చేశారు. ఈ
సందర్భంగా *మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ వైసిపి
ప్రభుత్వం ఏర్పడ్డాక 30 ఏళ్ల అభివృద్ధి నాలుగేళ్లలో చేసి చూపించామన్నారు.
పుంగనూరు గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో అభివృద్ధి చూడలేదని,ప్రతి పర్యటనలో పది
కోట్ల రూపాయల అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రారంభిస్తున్నామన్నారు. సిఎం జగన్
పుంగనూరు పై ప్రత్యేక శ్రద్ద వహించడంతో ఇంత అభివృద్ధి సాధ్యమైందన్నారు.
నాణ్యమైన విద్యుత్ ను ప్రజలకు అందించాలని ప్రతి మండలంలో సబ్ స్టేషన్లను
నిర్మిస్తున్నామని, ప్రజల మంచినీటి అవసరాల దృష్ట్యా ఆర్.ఓ ప్లాంటులు ఏర్పాటు
చేశామన్నారు. ఇప్పటికే ఇంటింటికీ కుళాయి ద్వారా నీరు ఇచ్చేందుకు పనులు
చేపడుతున్నామని, ఇందుకోసం ఇప్పటికే ప్రతి గ్రామంలో వాటర్ ట్యాంకులు
నిర్మించామన్నారు. పుంగనూరు నియోజకవర్గం లో దాదాపు ప్రతి గ్రామానికి రోడ్డులు
వేశామని, సంక్షేమ పథకాలు రాష్ట్ర వ్యాప్తంగా అనేక కుటుంబాలకు అందుతున్నాయని,
కులం, మతం, ప్రాంతం, పార్టీ లాంటివి చూడకుండా కేవలం పేదరికమే కొలమానంగా పథకాలు
అమలు జరుగుతోందని వెల్లడించారు.
పరికిదొన, గడ్డంవారిపల్లి, కోటూరు, వెంగళపల్లి, 29.ఎ చింతమాకులపల్లి,
కొండయ్యగారిపల్లి, చారాల, దుర్గసముద్రము, దాదేపల్లి, ఎ. కొత్తకోట లలో
(ఒక్కొక్కటి రూ.5 లక్షలతో) 10 ఆర్.ఓ.ప్లాంట్ లను, కొండామర్రి, బిల్లేరు,
దుర్గసముద్రములలో (ఒక్కొక్కటి రూ.320.00 లక్షలతో) 3 విద్యుత్ సబ్ స్టేషన్ లను,
వెంగళపల్లి, కాటీపేరి, లద్దిగం, 29-ఎ- చింతమాకులపల్లి లలో (ఒక్కొక్కటి
రూ.23.94 లక్షలతో) 4 రైతు భరోసా కేంద్రలను, కాటిపేరి, 29.ఎ చింతమాకులపల్లి,
చౌడేపల్లి, దుర్గసముద్రము లలో (ఒక్కొక్కటి రూ.20.80 లక్షలతో) 4 వై.యస్.ఆర్.
హెల్త్ సెంటర్ లను, గడ్డంవారిపల్లి లో రూ.17.5 లక్షలతో బి.యం.సి.యు ను,
లద్దిగం లో రూ.16.00 లక్షలతో డిజిటల్ లైబ్రరీ ని, పెద్దయల్లకుంట్లలో రూ.43.80
లక్షలతో గ్రామ సచివాలయాలను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జెడ్పీ సి
ఈ ఓ ప్రభాకర్ రెడ్డి, ఎస్పీడీసీఎల్ ఎస్ ఈ కృష్ణారెడ్డి,డి పి ఓ లక్ష్మి ,
జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీ కృష్ణ, మండల పరిషత్తు అధ్యక్షులు గాజుల
రామమూర్తి,జెడ్పీ టిసి నడింపల్లి దామోదర రాజు, బోయకొండ గంగమ్మ పాలక మండలి
చైర్మన్ నాగరాజు, మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు ఆర్.నరసింహులు,సుధాకర్
రెడ్డి, తహసిల్దార్ మాధవరాజు, మండల పరిషత్తు అభివృద్ధి అధికారి జి. సుధాకర్,
ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.