జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాలు నచ్చక టిడిపి మెట్లు తొక్కిన పీకే
చంద్రబాబు అరెస్ట్ సమయంలో లోకేష్ ఢిల్లీ పారిపోయాడు అంటూ వైసిపి
విమర్శనాస్త్రాలు
ఢిల్లీలో సైలెంట్ గా ఉంటూనే జగన్ అండ్ కో ని చావుదెబ్బ కొట్టిన లోకేష్
కిలారు రాజేష్ పై అనేక కేసులు పెట్టిన వైసిపి సర్కార్
పీకేని టిడిపి వైపు తిప్పడంలో కీలక పాత్ర పోషించిన కిలారు రాజేష్
విజయవాడ : వ్యూహం విడుదల కు ముందే ప్రతి వ్యూహం అమలు అయ్యింది. ఎవరి పై అయితే
జగన్ భవిష్యత్తు ఆధారపడి ఉందో అతనే ఇప్పుడు దూరం అయ్యాడు. ప్రశాంత్ కిషోర్
తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రముఖంగా వినపడే పేరు. ఓటమితో
ఢీలా పడిన వైసిపికి జీవం పోసి చరిత్ర లో కనీవినీ ఎరుగని విజయాన్ని అందించిన
వ్యక్తి ప్రశాంత్ కిషోర్. జగన్ అంటే పీకే.. పీకే అంటే జగన్ అంతగా వారి మధ్య
అనుబంధం ఏర్పడింది. కానీ నాలుగున్నర ఏళ్లలో అంతా తారుమారు అయ్యింది. జగన్
తీసుకున్న అనేక నిర్ణయాలు ప్రశాంత్ కిషోర్ కోపానికి కారణం అయ్యాయి. అందులో
ముఖ్యమైనది చంద్రబాబు అరెస్ట్. తాను వద్దన్నా జగన్ చంద్రబాబు ని అరెస్ట్ చేసి
తనగొయ్యి తానే తవ్వుకున్నాడు అనేది పీకే వెర్షన్. దానితో పాటు కర్ణుడి చావుకి
అనేక కారణాలు అన్నట్టు జగన్ తీసుకున్న అనేక ఒంటెద్దు నిర్ణయాలు ప్రశాంత్
కిషోర్ వైసిపి కి దూరం అవ్వడానికి కారణం అయ్యాయని అంటున్నారు.
చంద్రబాబు అరెస్ట్ సమయంలో లోకేష్ ఢిల్లీలో ఉన్నాడు. అదే సమయంలో వైసిపి
లోకేష్‌ని ట్రోల్ చేసింది. లోకేష్ ఢిల్లీ పారిపోయాడు అంటూ పెద్ద ఎత్తున
విరుచుకుపడింది. అయితే లోకేష్ ఎక్కడా హడావిడి పడకుండా ఒక పరిణితి చెందిన
నాయకుడిలా వ్యవహరించారు. అనేక రాజకీయ ప్రతి వ్యూహాలు అమలు చేయడానికి ఢిల్లీని
వేదికగా వాడుకున్నాడు. జగన్ పట్ల పీకే అసంతృప్తిగా ఉన్నాడు అనే విషయాన్ని
గమనించిన లోకేష్ తన మిత్రుడు కిలారు రాజేష్ ని అస్త్రంగా ప్రయోగించాడు. అంతా
వారు అనుకున్నట్టే జరిగింది. ఢిల్లీ లోనే జగన్ పతనానికి నాంది పడింది. ఒక పక్క
చంద్రబాబు ని జగన్ అరెస్ట్ చేయించాడు అంటూ వైసిపి వారు సంబరాలు చేసుకుంటున్న
సమయంలోనే లోకేష్ 2024 ఎన్నికలు గెలవడానికి కావాల్సిన అన్ని అస్త్రాలు సిద్ధం
చేసుకున్నాడు. కిలారు రాజేష్ చాపకింద నీరులా ప్రశాంత్ కిషోర్ ని లోకేష్
దగ్గరకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. వాస్తవానికి ప్రశాంత్ కిషోర్
చంద్రబాబు అరెస్ట్ అయిన సందర్భం నుండే లోకేష్ తో కలిసి పనిచేయడం మొదలు
పెట్టాడు. నిజం గెలవాలి కార్యక్రమాన్ని డిజైన్ చేసి చంద్రబాబు సతీమణి
భువనమ్మని ప్రజల్లోకి తీసుకెళ్లడం, అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టడంలో
ప్రశాంత్ కిషోర్ లోకేష్ కి నిత్యం సూచనలు చేస్తూ వచ్చారని సమాచారం.
ఢిల్లీలో లోకేష్, కిలారు రాజేష్ వైసిపి ని డ్యామేజ్ చేసే అతి పెద్ద ప్రణాళిక
అమలు చేస్తున్నా ఢిల్లీ లో మేము తోపులం అని చెప్పుకునే వైసిపి నాయకులు,
ఇంటెలిజెన్స్ వారు ఈ విషయాన్ని గమనించకపోగా లోకేష్ భయపడి దాక్కున్నాడు అంటూ
జగన్ ని తప్పుదోవ పట్టించారు. అదే నిజం అని నమ్మిన జగన్ పీకే ప్యాకప్ అనే
విషయాన్ని గమనించలేకపోయాడు. ఒక పక్క టికెట్లు లేవని చెప్పడంతో ఎమ్మెల్యేలు
తిరుగుబాటు చేస్తున్నారు. ఎంతో మంది టిడిపిలోకి టచ్ లోకి వెళ్లి సీట్ల కోసం
లాబీయింగ్ మొదలు పెట్టారు. మరో పక్క వైసిపి కి ప్రధాన బలంగా ఉన్న పీకే కూడా
జంప్ అవ్వడంతో వచ్చే ఎన్నికల్లో వై నాట్ 15 సీట్స్ అనే పరిస్థితికి వైసిపి
చేరుకుంది. ఇదంతా జగన్ అహంకారం, అసమర్ధత వలనే జరిగింది కనీసం పీకే ని కూడా
కాపాడుకోలేడా అంతేలే అమ్మ, చెల్లి వెళ్లిపోయారు పీకే ఆలస్యంగా కళ్లు
తెరిచినట్టు ఉన్నాడు అంటూ వైసిపి నాయకులు ఆఫ్ ది రికార్డ్ గుసగుసలు
ఆడుకుంటున్నారు. లోకేష్, కిలారు రాజేష్ ప్రతి వ్యూహం అమలు చెయ్యడంలో
విజయవంతమయ్యారు. వైసిపి ని డిఫెన్స్ లో పడేయడంలో సూపర్ సక్సెస్ అయ్యారు. అంతా
అద్భుతంగా ఉందని చెప్పే సలహాదారుల వల్లే జగన్ కి ఈ దుస్థితి వచ్చిందని
విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.