అమరావతి : తిరుమలలో భక్తులు భారీగా పోటెత్తారు. తిరుమలలో నేటి ఉదయం
తెల్లవారుజామున 1.45 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరుచుకోవడంతో భక్తులు ఆ
శ్రీనివాసుడిని దర్శించుకుంటున్నారు. అలాగే, శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి
పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తిరుమలకు భారీగా తరలివచ్చారు. దీంతో పాటు
ఏలూరులోని ద్వారకా తిరుమలలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి.
ఉత్తర ద్వారం గుండా చిన వెంకన్నను దర్శించుకునేందుకు భక్తులు భారీగా బారులు
తీరారు. దీంతో ఆలయ ప్రాంతం, పరిసర ప్రాంతాలు గోవింద నామస్మరణలతో
మారుమోగిపోతున్నాయి. ఇక, హైదరాబాద్ లోని తిరుమల తిరుపతి దేవస్థానానికి ( మినీ
తిరుపతి ) సైతం భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి శ్రీవారిని దర్శించుకుంటున్నారు.
తెల్లవారుజాము నుంచి ఉత్తర ద్వారా దర్శనంతో స్వామివారిని దర్శించుకుంటున్నారు.