బీసీలకు చట్ట సభల్లో 50శాతం రిజర్వేషన్ కల్పించాలి స్వాతంత్య్రం వచ్చి
దశాబ్దాలు గడుస్తున్నా బీసీల తలరాతలు మారలేదు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ
కన్వీనర్ వై.నాగేశ్వరరావు యాదవ్
అమరావతి : బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా మరో స్వాతంత్య్ర పోరాట రథయాత్రను
ప్రారంభించినట్లు పలువురు వక్తలు పేర్కొన్నారు. విజయవాడ తుమ్మలపల్లి
కళాక్షేత్రం వేదికగా శుక్రవారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం`ఆంధ్రప్రదేశ్
ఆధ్వర్యంలో సభను నిర్వహించారు. అంతకముందు విజయవాడ చిట్టినగర్ కొత్తఅమ్మవారి
గుడి వద్ద నుంచి రథయాత్ర ర్యాలీ ప్రారంభించారు. అక్కడి నుంచి తుమ్మలపల్లిలో
సభను నిర్వహించారు. ఈ సభలో మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, జాతీయ బీసీ
సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ వై.నాగేశ్వరరావు యాదవ్, మహిళా విభాగం రాష్ట్ర
ఇన్చార్జి వై.నూకానమ్మ తదితరులు ప్రసంగించారు. స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు
గడుస్తున్నా, బీసీల తలరాతలు మారలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో 90 అసెంబ్లీ, 13
పార్లమెంట్ స్థానాల్లో బీసీలకు రాష్ట్ర రాజకీయ పార్టీలు సీట్లు కేటాయించాలని
డిమాండ్ చేశారు. జాతీయ పార్టీలు 275 ఎంపీ సీట్లను కేటాయించాలని, ప్రకటించిన
మహిళా రిజర్వేషన్ల బిల్లులో బీసీలకు మహిళా సబ్ కోటా ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వ
జనగణనలోని కుల గణన చేపట్టాలని డిమాండ్ చేశారు. బీసీలకు చట్ట సభల్లో 50శాతం
రిజర్వేషన్ కల్పించాలన్నారు. ఈ రథయాత్రలో అన్ని పార్టీల్లో ఉన్న బీసీ నాయకులు,
కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి
బీసీ సంఘాల నేతలు, కార్యవర్గ సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ రథయాత్ర
శ్రీకాకుళం నుంచి విజయవాడ మీదుగా మొదటి దశలో పరిగణించారు. విజయవాడ నుంచి
సూళ్లూరుపేట వరకు రెండో యాత్ర, మూడో అడుగు రాయలసీమ ప్రాంతాల్లో ఈ యాత్ర
కొనసాగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య రాజకీయ పార్టీల్లోని బీసీ
నాయకులు పాల్గొన్నారు. మచిలీపట్నం పార్లమెంటు సభ్యుడు కొనగల నారాయణ,
తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు కొల్లు రవీంద్ర అన్ని రాజకీయ పార్టీల
నుంచి ముఖ్య బీసీ నాయకులు, సభ్యులు, పాల్గొన్నారు.