మానవత్వంతో ఆర్థిక సాయం అందించాలన్న ముఖ్యమంత్రి
ముగ్గురుకి రూ. మూడు లక్షలు ఆర్థిక సహాయం అందించిన కలెక్టర్ సుమిత్ కుమార్
పాడేరు : ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి ఆపన్నులకు అండగా నిలిచారు.
అల్లూరి జిల్లా చింతపల్లిలో నిన్న 21వ తేదీన తన పర్యటనలో భాగంగా ఆయన పలువురు
నుంచి వినతులు స్వీకరించారు. వివిధ అనారోగ్య కారణాలతో బాధ పడుతున్న వారికి
మందులు, వైద్య, ఇతర అవసరాల కోసం వచ్చిన వినతుల పట్ల సానుకూలంగా స్పందించిన
జగన్మోహన్ రెడ్డి బాధితుల పట్ల మానవత్వంతో స్పందించాలని ఉదారంగా ఆదుకోవాలని
అక్కడే ఉన్న కలెక్టర్ సుమిత్ కుమార్ ను ఆదేశించారు. దీంతో జిల్లా కలెక్టర్ తన
కార్యాలయంలో ముగ్గురు భాదితులకు లక్ష రూపాయలు చొప్పున మూడు లక్షల రూపాయలను
నేరుగా లబ్దిదారుల ఖాతాలకు ఆర్థిక సహాయంగా జమ చేసారు. ముఖ్య మంత్రి ఆదేశించిన
24 గంటల్లోనే ఈ ఆర్ధిక సహాయం అందజేయటం గొప్ప విషయమని లబ్దిదారులు రాష్ట్ర
ముఖ్యమంత్రికి, జిల్లా కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక సహాయం
అందుకున్న వారిలో చింతపల్లి మండలం గుమ్మడిగొండ గ్రామానికి చెందిన అడిగర్ల
రమ్యశ్రీ గత కొన్ని సంవత్సరాల నుండి తీవ్రమైన కండరాల వ్యాధితో మంచానికే
పరిమితమైందని, ఆర్థిక సాయం కోరడంతో ఆమెకు లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం
అందజేశారు. చింతపల్లి మండలం, చింతపల్లి గ్రామానికి చెందిన పంపోతి కొండబాబు గత
కొన్నాళ్ళుగా బ్రెయిన్ కేన్సర్ తో భాద పడుతూ మంచానికే పరిమతం అయ్యానని, ఆర్ధిక
సాయం చేయాలని కోరగా ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆయనకు లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం
అందజేశారు. చింతపల్లి మండలం దిబ్బగరువు గ్రామానికి చెందిన మోరి కృష్ణవేణి
పెరాలిసిస్ వ్యాధితో భాద పడుతూ మంచానికే పరిమితమైనందున ముఖ్యమంత్రి ఆదేశాల
మేరకు ఆమెకు లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం అందజేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్
సుమిత్ కుమార్ సంబంధిత చెక్కును వారి వారి ఖాతాలకు నేరుగా జమ అయ్యేవిధంగా
ఉత్తర్వులు జారీ చేసి లబ్దిదారులకు సమాచారం అందించారు.