రాష్ట్రంలో దళారీ వ్యవస్థకు తావులేకుండా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి
స్వచ్ఛమైన పాలనను అందిస్తున్నారని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్
ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ముఖ్యమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని
గురువారం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సత్యనారాయణపురం
గాయత్రీ ఫంక్షన్ హాల్ నుంచి కండ్రిక వరకు సాగిన ర్యాలీలో వైసీపీ జిల్లా
అధ్యక్షులు, పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా
పాల్గొన్నారు. తొలుత భారీ కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా “హ్యాపీ బర్త్ డే సీఎం సార్” అంటూ అభిమానులు చేసిన నినాదాలతో ఆ
ప్రాంతమంతా హోరెత్తింది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలతో
రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం వచ్చిందని మల్లాది విష్ణు అన్నారు.
సంక్షేమ పథకాల లబ్ధిదారులతో కలిసి సంబరాలలో పాల్గొనడం ఎంతో సంతోషాన్ని
కలిగించిందన్నారు. అధికారం చేపట్టిన అనతికాలంలోనే టంగుటూరి ప్రకాశం పంతులు,
నీలం సంజీవరెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి వంటి గొప్ప గొప్ప ముఖ్యమంత్రుల సరసన
సీఎం వైఎస్ జగన్ చేరారని మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. ప్రజాసంకల్పయాత్ర
ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకోవడమే కాకుండా.. అధికారంలోకి వచ్చిన తర్వాత
ప్రతిఒక్క హామీని తూచా తప్పకుండా అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్
జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు హయాంలో హామీలు అమలు చేయలేక
మేనిఫెస్టోను వెబ్ సైట్ నుంచి మాయం చేసిన అసమర్థ ప్రభుత్వాన్ని చూశామన్నారు.
కానీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాలుగున్నరేళ్ల కాలంలో 99శాతం హామీలు అమలు
చేసి.. ఎన్నికల మేనిఫెస్టోకు సరికొత్త నిర్వచనం ఇచ్చారని కితాబిచ్చారు. గత
నాలుగున్నరేళ్లలో డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా రాష్ట్ర ప్రజలకు అక్షరాల రూ.
4.71 లక్షల కోట్లు మేలు చేకూర్చారని చెప్పారు. కనుకనే మన రాష్ట్రం
దేశవ్యాప్తంగా సంక్షేమాంధ్రప్రదేశ్గా ప్రశంసలు అందుకుంటోందన్నారు.
అట్టర్ ఫెయిల్యూర్ కలయిక
చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ.. కలయిక అట్టర్ ఫెయిల్యూర్ అని
ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. 2014-19 మధ్య వీరి పాలనలో ఏ ఒక్క
వర్గానికి మేలు చేకూరకపోగా.. కార్మికులు, కర్షకులు, మహిళలు రూ. 2 లక్షల కోట్లు
నష్టపోయారని ఆరోపించారు. పైగా అధికారం కోసం తిరిగి మా ప్రభుత్వ పథకాలను అమలు
చేస్తామని చెప్పుకునేందుకు టీడీపీ నేతలు సిగ్గుపడాలన్నారు. అదే సంక్షేమాన్ని
అధికారంలో ఉన్న గత ఐదేళ్లు ఎందుకు అమలు చేయలేకపోయారో ప్రజలకు సమాధానం
చెప్పాలన్నారు. పేదల సంక్షేమాన్ని, మధ్య తరగతి ప్రజల చేయూతను పూర్తిగా
విస్మరించి ఒక ముఖ్యమంత్రిగా ఆనాడు చంద్రబాబు ఘోరంగా విఫలమైతే.. నేడు పేదలకు
జరుగుతున్న మంచిని అడ్డుకుంటూ ప్రధాన ప్రతిపక్ష నేతగానూ ఘోరంగా వైఫల్యం
చెందారని విమర్శించారు. ఈసారి ఎన్నికలలో చంద్రబాబు, పవన్ లకు డిపాజిట్లు కూడా
రావని.. రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావడం
ఖాయమని స్పష్టం చేశారు. అమ్మవారి ఆశీస్సులు సీఎం జగన్ పైన ఎల్లవేళలా ఉండాలని
కాంక్షిస్తూ.. ర్యాలీని జయప్రదం చేసిన ప్రతిఒక్కరికీ పేరుపేరున కృతజ్ఞతలు
తెలియజేశారు.
మా లక్ష్యం 175/175: వెల్లంపల్లి శ్రీనివాస్
కుటుంబంలో ప్రతి వ్యక్తి ఏదో ఒక ప్రభుత్వ పథకం ద్వారా లబ్ధి పొందేలా
రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన అందిస్తున్నారని పశ్చిమ ఎమ్మెల్యే
వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. పిల్లలకు అమ్మఒడి నుంచి అవ్వాతాతలకు పింఛన్
వరకు అన్ని వయస్సుల వారికి అండగా నిలుస్తున్నారని చెప్పుకొచ్చారు. గ్రామ
స్వరాజ్యం ఆకాంక్షతో సచివాలయ వ్యవస్థకు రూపకల్పన చేసి ప్రతి ఇంటి గడపకు
సంక్షేమ పథకాలను చేరువ చేస్తున్నారని చెప్పారు. ఆ పథకాలకు పేర్లు మార్చినంత
మాత్రాన చంద్రబాబుకు అవకాశం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా లేరన్న విషయాన్ని
టీడీపీ నేతలు గ్రహించాలన్నారు. రానున్న ఎన్నికలలో ప్రజల చల్లని దీవెనలతో 175
స్థానాలలో వైసీపీ విజయదుందుభి మ్రోగించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం
కండ్రికలో మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి ఘన నివాళులర్పించారు.
కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, నగర మహిళ
అధ్యక్షురాలు పిల్లి కృష్ణవేణి, వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు శర్వాణీ మూర్తి,
బాలి గోవింద్, కొంగితల లక్ష్మీపతి, ఎండి షాహినా సుల్తానా, ఇసరపు దేవి,
కొండాయిగుంట మల్లీశ్వరి, యరగొర్ల తిరుపతమ్మ, అలంపూర్ విజయలక్ష్మి, ఉమ్మడి
రమాదేవి, మోదుగుల తిరుపతమ్మ, పెనుమత్స శిరీష సత్యం, ఉద్ధంటి సునీత, కుక్కల
అనిత, జానారెడ్డి, వైసీపీ నాయకులు, పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్దసంఖ్యలో
పాల్గొన్నారు.