విజయవాడ : విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బుధవారం రాత్రి సెమీ
క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి
వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో సెమీ
క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడలో జరుగుతున్న వేడుకలకు సీఎం
జగన్తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. క్రిస్మస్
సందర్భంగా సీఎం జగన్ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ
అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. శత్రువుల పట్ల కూడా క్షమాగుణం
కలిగి ఉండాలని ఏసుక్రీస్తు సందేశం ఇచ్చారు అని స్పష్టం చేశారు. అనంతరం,
కొవ్వుత్తులు వెలిగించి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక, ఇదే సమయంలో పలు
రంగాల్లో విశేష కృషి చేసిన వారికి సీఎం జగన్ అవార్డులను ప్రదానం చేశారు.