విజయవాడ : జాతీయ స్థాయి చిన్న కథల పోటీల్లో నగరానికి చెందిన రచయిత పాణిగ్రాహి
రాజశేఖర్ కు బహుమతి లభించింది. ముట్టూరి కమలమ్మ ఫౌండేషన్, సాహితీ కిరణం
సాహిత్య మాస పత్రిక సంయుక్తంగా నిర్వహించిన జాతీయ స్థాయి చిన్న కథల పోటీల
ఫలితాలను సాహితీ కిరణం సంపాదకులు పొత్తూరి సుబ్బారావు వెల్లడించారు. ఈ
పోటీల్లో విజేతలందరికీ ఒకొక్కరికి వెయ్యి రూపాయలు చొప్పున అందరికీ సమాన
బహుమతులు అందజేస్తామన్నారు. శ్రీకాకుళానికి చెందిన మల్లారెడ్డి రామకృష్ణ రాసిన
పెళ్లి చూపులు కథ, హైదరాబాద్ కు చెందిన కృపాకర్ పోతుల రచన నాన్న ఫొటో,
బెంగుళూరుకు చెందిన మద్దూరి నరసింహమూర్తి కథ చివరి స్నానం, విజయవాడకు చెందిన
పాణిగ్రాహి రాజశేఖర్ రచన భూమి, తిరుపతికి చెందిన ఆర్.సి.కృష్ణస్వామి రాజు
రచన క్యాన్సర్, రాజమహేంద్రవరానికి చెందిన కట్టా రాంబాబు రచన బుద్ధి లేని
మనుషులు, విజయవాడకు చెందిన కోపూరి పుష్పాదేవి రచన దిగువకే కథలు బహుమతులకు
ఎంపికయ్యాయని ఆయన వివరించారు. విజేతలకు పొత్తూరు సాహితీకిరణం బ్రాంచి
కార్యాలయంలో 2024 ఏప్రిల్ జరిగే ఉగాది వేడుకల్లో బహుమతులు అందజేస్తామన్నారు.
నగరానికి చెందిన ఇద్దరు రచయితల కథలకు బహుమతులు లభించడంపై నగర రచయితలు, కవులు,
సాహితీ ప్రియులు అభినందనలు తెలిపారు.