నెల్లిమర్ల : వైసీపీ అక్రమాలకు ప్రజలు గుణపాఠం చెప్పాలని టీడీపీ పొలిట్
బ్యూరో సభ్యుడు నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. టీడీపీ జాతీయ ప్రధాన
కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా ‘యువగళం-నవశకం’
పేరుతో టీడీపీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. విజయవనగరం జిల్లా నెల్లిమర్ల
నియోజకవర్గం పోలిపల్లి వద్ద ఏర్పాటు చేసిన సభకు రాష్ట్ర నలుమూలల నుంచి టీడీపీ
, జనసేన శ్రేణులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ
లోకేశ్ యువగళంలో ప్రజాగళం కదంతొక్కింది. పాదయాత్రకు అనేక అడ్డంకులు
సృష్టించినా విజయవంతంగా పూర్తి చేశారు. ఎంతో మంది ప్రజలను లోకేశ్ ఓదార్చారు.
ప్రజా సమస్యలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోరాడుతున్నారు. రాష్ట్రంలో ఒక
చెత్త ప్రభుత్వం ఉంది. ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చారు. అమరావతిని
అభివృద్ధి చేయకుండా రాష్ట్రాన్ని గాలికొదిలేశారు. అమరావతికి భూములిచ్చిన రైతుల
ఉద్యమాన్ని అణచివేశారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా పూర్తి చేస్తామని
చెప్పిన పోలవరం ప్రాజెక్టును నాలుగేళ్లు అయినా పూర్తి చేయలేదు. పోలవరాన్ని
పూర్తి చేయలేని చేతకాని ప్రభుత్వం ఇది. రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా
పెరిగిపోయింది. డ్రగ్స్ దందాలో మాత్రం రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా నిలిపారు.
ల్యాండ్, శాండ్ స్కాములతో రూ.కోట్లు దోచుకున్నారు. అన్ని రంగాల్లో రాష్ట్రం
వెనుకబడిపోయింది. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు లేవు.. యువతకు ఉపాధి అవకాశాలు
లేవు. వైకాపా అక్రమాలు ఇలాగే కొనసాగితే ప్రపంచ పటంలో ఏపీ ఉండదు. సైకో ఈ
రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. సమయం లేదు మిత్రమా.. విజయమా.. వీర్గ
స్వర్గమా? తేల్చుకోవాల్సిన పరిస్థితి మనది. రాష్ట్ర భవిష్యత్తు ప్రజల
చేతుల్లోనే ఉందని బాలకృష్ణ అన్నారు.