వ్యయపరిమితి రూ. 25 లక్షల పెంపుతో పాటు పథకంపై అవగాహన కల్పించేందుకు
మెగా డ్రైవ్
5,36,592 స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీకి ఏర్పాట్లు
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
ఎన్టీఆర్ జిల్లా : పేద, మధ్యతరగతి ప్రజలెవరూ వైద్యం కోసం
అప్పులపాలవుకూడదనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఆరోగ్య
భద్రత కల్పించేందుకు డా. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకానికి వేలాది కోట్లు
ఖర్చు చేస్తోందని, ఒక్క ఎన్టీఆర్ జిల్లాలోనే 2019, ఏప్రిల్ నుంచి
ఇప్పటివరకు వివిధ రకాల చికిత్సలు, శస్త్రచికిత్సల కోసం రూ. 427 కోట్లు
ఖర్చు చేసినట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. డా. వైఎస్ఆర్
ఆరోగ్యశ్రీ కింద రూ. 25 లక్షల వరకు ఉచిత వైద్యం, ప్రతి ఇంటికీ వెళ్లి
ఆరోగ్యశ్రీపై మరింత అవగాహన కల్పిస్తూ కొత్త ఫీచర్లతో స్మార్ట్
ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్
మోహన్‌రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సోమవారం ప్రారంభించారు. ఈ
కార్యక్రమానికి జిల్లా కలెక్టరేట్ వీసీ హాల్ నుంచి కలెక్టర్
ఎస్.డిల్లీరావు, విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు, రాష్ట్ర ప్లానింగ్
బోర్డు వైస్‌ఛైర్మన్ మల్లాది విష్ణువర్ధన్, విజయవాడ పశ్చిమ
శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు, రాష్ట్ర ఫైబర్‌నెట్ లిమిటెడ్
ఛైర్మన్ పి.గౌతమ్ రెడ్డి, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఆరోగ్యశ్రీ
జిల్లా సమన్వయకర్త జె.సుమన్, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల
అధికారులు తదితరులు వర్చువల్‌గా హాజరయ్యారు.
ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద చికిత్సల వ్యయ పరిమితిని రూ. 25
లక్షలకు పెంపు, స్మార్ట్ ఆరోగ్యశ్రీకార్డుల పంపిణీ కార్యక్రమాన్ని
ప్రారంభించిన అనంతరం కలెక్టర్, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులకు
స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డులను అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్
డిల్లీరావు మాట్లాడుతూ ప్రభుత్వం గొప్ప పథకాలైన ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా
పథకాలకు ఏడాదికి రూ. 4 వేల కోట్లు ఖర్చుచేస్తోందన్నారు. ఇప్పుడు వ్యయ
పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ. 25 లక్షలకు పెంచినట్లు తెలిపారు.
క్యూఆర్ కోడ్ వంటి కొత్త ఫీచర్లతో రూపొందించిన స్మార్ట్ ఆరోగ్యశ్రీ
కార్డులను పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. జిల్లాకు సంబంధించి 5,36,592
కార్డుల పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కార్డుల పంపిణీతో పాటు మెగా
డ్రైవ్ ద్వారా ఆరోగ్యశ్రీ పథకంపై పూర్తిస్థాయిలో అవగాహన
కల్పించనున్నామని, మొబైళ్లలో ఆరోగ్యశ్రీ యాప్‌ను డౌన్లోడ్ చేయించే
కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జగనన్న ఆరోగ్య
సురక్ష-2 కార్యక్రమాన్ని 2024, జనవరి 1 నుంచి నిర్వహించేందుకు
ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ డిల్లీరావు తెలిపారు.
ఆరోగ్య సేవల రంగంలో నూతన అధ్యాయం: విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు
మల్లాది విష్ణువర్ధన్, విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు, రాష్ట్ర
ప్లానింగ్ బోర్డు వైస్‌ఛైర్మన్ మల్లాది విష్ణువర్ధన్ మాట్లాడుతూ
వ్యయపరిమితిని రూ. 25 లక్షలకు పెంచడం ద్వారా నూతన అధ్యాయం మొదలైందని
పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి అధికారం చేపట్టిన నాటి నుంచి ఆరోగ్య రంగంపై
ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. నెట్వర్క్ ఆసుపత్రుల
సంఖ్యను, చికిత్సల సంఖ్యను పెంచడంతో పాటు ఇప్పుడు వ్యయపరిమితిని రూ. 25
లక్షలకు పెంచినట్లు వెల్లడించారు. ఆరోగ్యశ్రీ పథకానికి ఎవరూ దూరం
కాకూడదనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమం
నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు ఆరోగ్యాన్ని హక్కుగా భావించి
సేవలు పొందేందుకు వీలుగా ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసేందుకు
ముఖ్యమంత్రి కృషిచేస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణువర్ధన్ అన్నారు.
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా : విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు
వెలంపల్లి శ్రీనివాసరావు
విజయవాడ పశ్చిమ శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని,
వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్సల సంఖ్యను 3,257కు నెట్వర్క్
ఆసుపత్రుల సంఖ్యను 2,513కు పెంచినట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లోనూ
స్పెషలిస్టు వైద్య సేవలు అందుతున్నాయన్నారు. ఆరోగ్యశ్రీ అనగానే దివంగత
ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గుర్తు కొస్తారని, ఆయన ప్రవేశపెట్టిన
పథకాన్ని ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు.
వ్యయపరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ. 25 లక్షలకు పెంచినట్లు
వివరించారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేశారని,
నూతనంగా 17 మెడికల్ కళాశాలలను ఏర్పాటుచేస్తున్నట్లు పేర్కొన్నారు.
కేన్సర్ వంటివాటికి పూర్తిస్థాయిలో చికిత్స : మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ కేన్సర్ వంటి వాటికి
పూర్తిస్థాయిలో చికిత్స లభించేలా రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం
ద్వారా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ పథకాన్ని ప్రజలు సద్వినియోగం
చేసుకోవాలని, జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ద్వారా ఎంతో మేలు
జరిగిందని.. బీపీ, షుగర్ తదితరాలతో బాధపడుతున్న వారిని గుర్తించి,
తగిన వైద్య సేవలు అందించేందుకు వీలయిందన్నారు. జనవరి 1 నుంచి జగనన్న
ఆరోగ్య సురక్ష రెండో విడత కార్యక్రమం ప్రారంభం కానుందన్నారు.
కార్యక్రమంలో డీఎంహెచ్‌వో డా. ఎం.సుహాసిని, జిల్లా గ్రంథాలయ సంస్థ
ఛైర్పర్సన్ టి.జమల పూర్ణమ్మ, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్
ఛైర్మన్ తోలేటి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.