ఏలూరు : రాష్ట్ర వ్యాప్త పర్యటన ద్వారా తొమ్మిదిన్నరేళ్లలో ప్రధానమంత్రి
నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేస్తున్నామని కేంద్ర మాజీ
మంత్రి, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. ఆదివారం
మీడియాతో మాట్లాడుతూ ‘‘జిల్లా వాసుల కోసం 216 జాతీయ రహదారి రూ. 316 కోట్లతో
అభివృద్ధి చేశాం. జిల్లాలో 75 కోట్లతో పలు రైల్వేస్టేషన్ల అభివృద్ధి చేశాం.
కోటిపల్లి- నర్సాపురం రైల్వే లైన్ పనులకు 75 శాతం కేంద్ర ప్రభుత్వం నిధులు
ఇచ్చింది.. కానీ ఏపీ ప్రభుత్వ వాటా 25 శాతం నిధులు విడుదల కాలేదు. రూ. 330
కోట్ల కేంద్ర నిధులతో నర్సాపురం మండలం సరిపల్లి గ్రామంలో ఆక్వా పార్క్ ఏర్పాటు
చేశాం. జిల్లాకు లక్షా 5 వేల ఇళ్లను కేంద్రం మంజూరు చేస్తే ఎన్ని ఇళ్లు
నిర్మించారో జగన్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. జగన్ ప్రభుత్వం రూ .170 కోట్లకు
టిడ్కో గృహాలను తాకట్టు పెట్టి పేదలకు నోటీసులు ఇవ్వడం దారుణం. రాష్ట్ర
ప్రభుత్వ చేస్తున్న ఆన్యాయాలపై ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు. సాగు
నీరు కాల్వల అభివృద్ధికి కేంద్ర నిధులు ఇస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం
నిర్లక్ష్యం చేస్తూ రైతులకు అన్యాయం చేస్తోంది. ఆడుదాం ఆంధ్ర పథకం కాదు..
ఆంధ్ర రాష్ట్రంతో వైసీపీ ప్రభుత్వం ఆడుకుంటోంది. రాష్ట్రంలో వైసీపీ నిరంకుసత్వ
పరిపాలన సాగుతోందిని దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు
[image: image.png]