విజయనగరం : యువగళం ముగింపు సభ ఆంధ్రా చరిత్రలో సరికొత్త అధ్యాయం కాబోతుందని
ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆదివారం విజయనగరం జిల్లా
భోగాపురం మండలం పోలిపల్లిలో టీడీపీ ఎన్నికల శంఖారావం సభా వేదిక పరిశీలించారు.
ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ భోగాపురం మండలం పోలిపల్లిలో
ఈనెల 20వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకే సభ ప్రారంభమవుతుంది. ఆర్టీసీకి అద్దె
చెల్లిస్తాం బస్సులివ్వాలని ఏపీఎస్ ఆర్టీసీని అడిగితే స్పందన లేదు. ఏ వాహనం
అందుబాటులో ఉన్నా వేదిక దగ్గరకు సకాలంలో కార్యకర్తలు, నేతలు చేరుకోవాలి. 2024
ఎన్నికల సమరానికి టీడీపీ, జనసేన సిద్ధమని శంఖారావాన్ని పూరిస్తాం. జగన్రెడ్డి
దురాగతాలను తుదముట్టించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేస్తామని
అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
[image: image.png]