టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు
శ్రీకాకుళం : రాష్ట్రంలో సహజ వనరుల్ని వైసీపీ నేతలు దోపిడీ చేస్తున్నారని
టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. రూ.వేల కోట్ల విలువైన
క్వార్ట్జ్ను మంత్రి కాకాణి అక్రమంగా విక్రయిస్తున్నారని, ఆయనపై చర్యలు
తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఒకచోట చెల్లని నేతలు మరోచోట చెల్లుతారా?: వైసీపీ ప్రభుత్వం వెంటిలేటర్‌పై
ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం
జిల్లా టీడీపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో సమావేశమైన ఆయన ఈనెల 20వ తేదీన
యువగళం పాదయాత్ర ముగింపు సభపై దిశానిర్దేశం చేశారు. అనంతరం మీడియాతో
మాట్లాడుతూ సీఎం జగన్ సహా వైసీపీ నేతలు అందరూ అవినీతిలో కూరుకుపోయారని
ఆరోపించారు. ఒక నియోజకవర్గంలో చెల్లని వైసీపీ నేతలు మరోచోట చెల్లుతారా అని
ప్రశ్నించారు.
[image: image.png]