*అక్రమ మైనింగ్‌తో జనావాసాల్లోకి ఏనుగులు
అమరావతి : నాలుగేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌ను రాజధాని లేని రాష్ట్రంగా సీఎం జగన్
మోహన్ రెడ్డి మార్చారని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
దుయ్యబట్టారు. స్వీయ ఆర్థికాభివృద్ధి ప్రాజెక్టు అమరావతిని 4 ఏళ్లుగా
నిర్వీర్యం చేశారని ఆయన మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అత్యాశ,
అసూయతో జగన్ తీసుకున్న విధ్వంసకర నిర్ణయాల వల్ల భూములు ఇచ్చిన వేల మంది
రైతులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే
3 నెలల్లో జగన్ చేసిన తప్పులన్నీ సరిచేస్తామని హామీ ఇచ్చారు. రైతుల త్యాగం
వృథా కాదని ఈ సందర్భంగా చంద్రబాబు భరోసా ఇచ్చారు.
అక్రమ మైనింగ్‌తో ఏనుగులు జనావాసాల్లోకి ఏనుగులు : చిత్తూరు జిల్లా
కలెక్టర్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. కుప్పం
నియోజకవర్గంలో ఏనుగుల దాడులను అరికట్టాలని లేఖలో కోరారు. అక్రమ మైనింగ్‌తో అవి
జనావాసాల్లోకి వస్తున్నాయని, ఏనుగుల దాడుల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని
పేర్కొన్నారు.
[image: image.png]