భవిష్యత్‌కు గ్యారెంటీపై విస్తృత ప్రచారం చేయండి
నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీ
లక్ష్యాన్ని వివరించండి
వైసీపీ వైఫల్యాలను విరిస్తూ టీడీపీ ధ్యేయాన్ని ప్రజలకు తెలియజేయండి
డివిజన్‌స్థాయి టీడీపీ నేతలకు దిశానిర్దేశం చేసిన మాజీ మంత్రి పొంగూరు
నారాయణ
టీడీపీ శ్రేణులతో కీలక అంశాలపై సూచనలిచ్చిన టీడీపీ పార్లమెంట్
అధ్యక్షులు అబ్దుల్ అజీజ్
నెల్లూరు : నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజీలోని మాజీ మంత్రి పొంగూరు నారాయణ
క్యాంపు కార్యాలయంలో ఆదివారం 44,45,46,48
డివిజన్ స్థాయి టీడీపీ నేతలతో సమీక్ష సమావేశం జరిగింది. నెల్లూరు
పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్‌తో కలిసి ఆయన బాబు ష్యూరిటీ –
భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమం, ఓటర్ల వెరిఫికేషన్‌పై నేతలకు
దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి నారాయణ మాట్లాడుతూ
క్రమశిక్షణకు మారుపేరైన తెలుగుదేశంపార్టీలో పని చేసే ప్రతి కార్యకర్త ఓ
వీరసైనికుడిలాంటివారని చెప్పారు. అలనాడు బ్రిటీష్ పరిపాలన నుంచి
భారతదేశానికి విముక్తి కలిగించినట్లు… నేడు నియంతృత్వపాలన సాగిస్తున్న
వైసీపీ ప్రభుత్వపాలన నుంచి ప్రజలకు స్వచ్ఛ కల్పించాల్సిన అవసరం
ఎంతైనా ఉందన్నారు. ఈ క్రమంలో వైసీపీ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో
ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రజాధరణతో రానున్న 2024లో
జరగనున్న ఎన్నికల్లో టీడీపీ విజయధుంధుబి మ్రోగించబోతుందన్నారు.
అప్పుడు ప్రజలందరికీ చంద్రబాబునాయుడు నాయకత్వంలో సుపరిపాలన
రాబోతోందని చెప్పారు. ఈ మేరకు నెల్లూరునగర నియోజకవర్గ పరిధిలోని
ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీ లక్ష్యాన్ని వివరించాలని, క్షేత్రస్థాయిలో
బాబు ష్యూరిటీ – భవిష్యత్‌కు గ్యారెంటీపై విస్తృతస్థాయిలో ప్రచారం చేయాలని
సూచించారు. అనంతరం టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ
నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో బాబు ష్యూరిటీ – భవిష్యత్‌కు
గ్యారెంటీ కార్యక్రమం, ఓటర్ల వెరిఫికేషన్ ఎలా చేయాలనే విషయమై టీడీపీ
శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పలు కీలక అంశాలపై టీడీపీ నాయకులతో
అబ్దుల్ అజీజ్ చర్చించారు. ఏదేమైనా టీడీపీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు
అంకితభావంతో పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ
ముఖ్యనేతలు, కార్యకర్తలు, డివిజన్ ఇన్‌చార్జ్‌లు, తదితరులు
పాల్గొన్నారు.