విజయవాడ : రాష్ట్రంలో ఓట్లు తొలగించాలంటూ వచ్చిన దరఖాస్తులను పరిష్కరించే
ముందు ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును దృష్టిలో ఉంచుకోవాలని సిటిజన్స్
ఫర్ డెమోక్రసీ సంస్థ ప్రధాన కార్యదర్శి , రాష్ట్రఎన్నికల పూర్వ ప్రధానాధికారి
డా. నిమ్మగడ్డ రమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లకు, ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్
అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఆమేరకు డా.రమేష్ కుమార్ వారందరికీ ఒక లేఖను
రాశారు. లేఖ రాసిన విషయాన్ని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. అనూప్ బరన్
వాల్ వెర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన
తీర్పులో
ఓటుహక్కును ప్రాథమికహక్కుగా పరిగణిస్తూ పేర్కొన్నదనీ , అందువల్ల ఓట్లను
తొలగించేముందు సంబంధిత అధికారులు తీర్పును అవగాహన చేసుకుని అత్యంత
అప్రమత్తంగా వ్యవహరించాలని లేఖలో కోరినట్లు డా.రమేష్ కుమార్ ఆ ప్రకటనలో
వెల్లడించారు. సుప్రీంకోర్టు తాజాతీర్పు నేపథ్యంలో రాష్ట్రంలో ఓట్ల
తొలగింపుకోసం ఫారం 7 ప్రకారం వచ్చిన దరఖాస్తులను పరిశీలించేటప్పుడు ఓటరు
ప్రాథమిక హక్కుకు భంగం కలుగకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లు,
ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులపై ఉందని డా.రమేష్ కుమార్ స్పష్టం చేశారు.
సరైన ధ్రువీకరణ , పత్రాల పరిశీలన ద్వారా మాత్రమే ఓటర్ల తొలగింపు చేయాల్సి
ఉంటుందని , అలా కానిపక్షంలో అందుకు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులే
బాధ్యులు అవుతారని, వారు న్యాయపరమైన వివాదాలకు గురయ్యే అవకాశం కూడా ఉందని ,
డా. రమేష్ కుమార్ స్పష్టం చేశారు. తాను రాసిన లేఖతో పాటు సుప్రీంకోర్టు
తీర్పు ప్రతిని జిల్లా కలెక్టర్లకు , ఎలెక్టోరల్ అధికారులకు పంపించారు. తమ
లేఖకు స్పందించి అధికారులు తగిన చర్యలు తీసుకుంటారని డా.నిమ్మగడ్డ రమేష్
కుమార్ ఆశాభావం వ్యక్తంచేశారు.