పెన్షన్ రూ. 3 వేలకు పెంపు నిర్ణయానికి కేబినెట్ ఆమోద ముద్ర
ఆరోగ్య శ్రీ చికిత్స మొత్తం పరిమితి రూ.25 లక్షలకు పెంపునకు ఆమోదం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారికి డీఏ, డీఆర్
మిచాంగ్ తుపాను బాధితులకు నష్ట పరిహారం అందించేందుకు కేబినెట్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
వెలగపూడి : ఆంధ్రప్రదేశ్ సీసీటీవీ సర్వైలెన్స్ ప్రాజెక్టుతోపాటు వివిధ
జిల్లాల్లో రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ల ఏర్పాటు కోసం రూ.552 కోట్ల రుణ
సేకరణకు ఏపీ కేబినెట్ అనుమతిచ్చింది. రుణ సేకరణకు ఏపీఎఫ్ఎస్ఎల్కు
అనుమతివ్వాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి జగన్
అధ్యక్షతన శుక్రవారం మంత్రివర్గం సమావేశమైంది. ఈ భేటీలో మంత్రిమండలి కీలక
నిర్ణయాలు తీసుకుంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం వెలగపూడి
సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరిగింది. సచివాలయంలోని మొదటి
బ్లాక్‌లోని కేబినెట్ సమావేశ మందిరంలో కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై
చర్చించారు. కేబినెట్ భేటీలో మొత్తం 45 అంశాలపై చర్చించారు. మిచాంగ్ తుపాను
బాధితులకు నష్ట పరిహారం అందించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పెన్షన్ రూ.
3 వేలకు పెంపు నిర్ణయానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. యాంటి నక్సల్
ఆపరేషన్‌లో పని చేసే వారికి 15 శాతం అలవెన్స్ పెంపునకు కేబినెట్ ఆమోదం
తెలిపింది. కోర్టులలో పనిచేసే సిబ్బంది, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వ
ఉద్యోగులతో సమానంగా డీఏ, డీఆర్ చెల్లింపులపై కేబినెట్లో చర్చించారు. యాభై
ఎకరాల లోపు ఉన్న 110 భూ కేటాయింపులను ఏపీఐఐసీకి కేటాయింపుపై చర్చ జరిగింది.
ఏపీ స్టేట్ సీసీ టీవీ సర్వైవలెన్స్ ప్రాజెక్ట్‌కి రూ.552 కోట్లు బ్యాంక్ నుంచి
అప్పు తీసుకోవడంపై కూడా చర్చించింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో
అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఏర్పాటు ప్రతిపాదనపై కేబినెట్లో చర్చ జరిగింది.
‘ఆడుదాం ఆంధ్ర’పై కేబినెట్లో చర్చించారు. సాధారణ ఎన్నికల నిర్వహణకు 982
తాత్కాలిక పోస్టులు అదనంగా క్రియేట్ చేయడంపై కేబినెట్లో నిర్ణయం
తీసుకున్నారు. సీఐడీ ప్రాంతీయ కార్యాలయం నిర్మాణానికి విజయవాడ లోని రాయనపాడులో
20 సెంట్లు కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ జగన్న శాశ్వత భు
హక్కు, భూ రక్ష పథకం కోసం కేబినెట్ సబ్ కమిటీ, స్టీరింగ్ కమిటీ తీసుకున్న
నిర్ణయాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఎన్నికలకు సర్వసన్నద్ధంగా ఉండాలి : సీఎం జగన్ మాట్లాడుతూ 20 రోజుల ముందే
ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని, సర్వసన్నద్ధంగా ఉండాలని మంత్రులకు
స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి వరకు మంత్రులు పర్యవేక్షిస్తుండాలని
నిర్దేశించారు. జనవరి నుంచి సామాజిక పెన్షన్లు రూ.2,750 నుంచి రూ.3 వేలకు
పెంపు నిర్ణయానికి ఆమోదం. ఆరోగ్య శ్రీ చికిత్స మొత్తం పరిమితి రూ.25 లక్షలకు
పెంపునకు ఆమోదం తెలిపారు. జనవరిలో చేయూత, వైఎస్సార్ ఆసరా పథకాల అమలుకు ఆమోదం
తో పాటు జనవరిలో ప్రారంభమయ్యే జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత కార్యక్రమానికి
ఆమోదం తెలిపారు. మిచాంగ్ తుపాను పరిహారం, కొత్త రేషన్ కార్డుల పంపిణీ,
విశాఖలో లైట్ మెట్రో ప్రాజెక్టు డీపీఆర్, విశాఖలో ఓ ప్రైవేటు విద్యాసంస్థకు
11 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపు నిర్ణయానికి ఆమోదం తెలిపారు. వైఎస్ఆర్
జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పజతకం అమలు కోసం కేబినెట్ సబ్ కమిటీ,
స్టీరింగ్ కమిటీ నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. రాష్ట్రంలోని 11 మెడికల్
కాలేజీల్లో యూరాలజీ, నెఫ్రాలజీ విభాగాల ఏర్పాటు, సిబ్బంది నియామకానికి ఆమోదం
తెలిపారు. కోర్టుల సిబ్బంది, పింఛనుదారులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో
సమానంగా డీఏ, డీఆర్ చెల్లింపులపై చర్చ జరిగింది. యాంటీ నక్సల్ ఆపరేషన్లలో
పాల్గొనే వారికి 15 శాతం భృతి పెంపు నిర్ణయానికి ఆమోదం తెలిపారు. 110 భూ
కేటాయింపుల వ్యవహారాలు ఏపీఐఐసీకి అప్పగించడంపై, రాష్ట్ర సీసీ టీవీ నిఘా
ప్రాజెక్టు కోసం బ్యాంకు నుంచి రూ.552 కోట్ల రుణం తీసుకోవడంపై, కుల, ఆదాయ
ధ్రువీకరణ పత్రాల మంజూరులో సంస్కరణలపై, ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలపై చర్చ
జరిగింది. ఎన్నికల నిర్వహణ కోసం అదనంగా 982 పోస్టులు సృష్టించాలని నిర్ణయం
తీసుకున్నారు.