నియామక ఉత్తర్వులు అందజేసిన పవన్ కళ్యాణ్
మంగళగిరి : జనసేన పార్టీ ప్రచార విభాగం ఛైర్మన్ గా బన్నీ వాస్ ను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నియమించారు. గురువారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నియామక ఉత్తర్వులను స్వయంగా పవన్ కళ్యాణ్ బన్నీ వాస్ కు అందజేశారు. ప్రచార విభాగం పార్టీకి కీలకమైందని, సమన్వయంతో ప్రచార విభాగాన్ని ముందుకు నడిపించాలని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సూచించారు. పార్టీ ఆశయాలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంతోపాటు రానున్న ఎన్నికల్లో పార్టీ గెలుపునకు వినూత్న కార్యక్రమాలను రూపొందించాలని చెప్పారు. పార్టీ ఉన్నతి కోసం మరింతగా కష్టపడాలని ఈ సందర్భంగా బన్నీ వాస్ కు శుభాకాంక్షలు తెలిపారు.