కెఎల్ డీమ్డ్ యూనివర్శిటీలో సిల్వర్ జూబిలీ వేడుకలకు సర్వం సిద్దమయ్యాయని పూర్వ విద్యార్దుల విభాగం డైరెక్టర్ డాక్టర్ కె.సిహెచ్.కావ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 1994-1998 విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్దులందరికీ 25 సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా సిల్వర్ జూబిలీ వేడుకలు నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. ఈ సందర్బంగా ప్రో వైస్ చాన్సలర్ డాక్టర్ ఎన్.వెంకట్ రామ్, ఇసిఇ విభాగాధిపతి డాక్టర్ ఎం.సుమన్, రిజిస్ట్రార్ డాక్టర్ కె.సుబ్బారావుల చేతుల మీదుగా సిల్వర్ జూబిలీ వేడుక పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఈ 25 సంవత్సరాల కాలంలో కలుసుకోలేకపోయిన వారంతా ఈ నెల 23న కెఎల్ వర్శిటీలో ఒకే వేదిక మీద కలుసుకునే సదవకాశం వచ్చిందని ఆమె పేర్కొన్నారు. కెఎల్ పూర్వ విద్యార్దులందరూ దేశ విదేశాల్లో మంచి మంచి స్థాయిల్లో స్థిరపడి ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్శిటీ వైస్ ఛాన్సులర్ డాక్టర్ జి. పార్థసారధి వర్మ, ప్రో వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఏవీఎస్ ప్రసాద్, డాక్టర్ ఎన్. వెంకట్రామ్, రిజిస్ట్రార్ డాక్టర్ కె. సుబ్బారావు, పూర్వ విద్యార్దుల విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ కె.సోని తదితరులు పాల్గొన్నారు.