తిరుపతి : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చినంత మాత్రాన ఏమీ జరగదని వైసీపీ అధిష్ఠానాన్ని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. ‘‘తెలంగాణలో మాదిరిగానే ఏపీలో కూడా ప్రభుత్వం మార్పు తప్పదు. జగన్ పాలనలో అహంకారం, నియంతృత్వం పెరిగిపోయింది. ఆయన హెలికాప్టర్లో తిరిగితే ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయి. సీఎం పర్యటన కోసం మనుషులను నిర్బంధించడం దారుణమ ని నారాయణ విమర్శించారు.