గుంటూరు : కోర్టు ఆదేశాలు పాటించని గుంటూరు మున్సిపల్ కమిషనర్ కీర్తికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జైలు శిక్ష విధించింది. గుంటూరు కార్పొరేషన్ పరిధిలోని యడవలి వారి సత్రాన్ని అక్రమంగా ఆక్రమించుకొని ఎటువంటి లీజ్ చెల్లించకుండా స్కూల్‌ను నడుపుతున్నారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై గతంలో విచారణ చేపట్టిన హైకోర్టు పిటిషనర్లకు రూ.25 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. అయితే ఆ ఆదేశాలను మున్సిపల్ కమిషనర్ అమలు చేయడంలేదంటూ పిటిషనర్ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై విచారణ చేపట్టిన హైకోర్టు.. మున్సిపల్ కమిషనర్ కీర్తికి నెల రోజుల జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధించింది. జనవరి 2న హైకోర్టు రిజిస్ట్రార్ వద్ద లొంగిపోవాలని ఆమెను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
[https://bloomtimes.org/images/srilekha_/highcourt.jpg]
[https://bloomtimes.org/images/srilekha_/highcourt.jpg]