చిత్తూరు : పుంగనూరు నియోజకవర్గ అభివృద్ధి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి శ్రద్ధతోనే సాధ్యమైందని రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి డా. పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పేర్కొన్నారు. సోమవారం రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి పుంగనూరు నియోజకవర్గం రొంపిచెర్ల మండలంలో పర్యటించి పలు ప్రభుత్వ భవనాలు, విద్యుత్ సబ్ స్టేషన్ లను ప్రారంభించారు. పుంగనూరు నియోజకవర్గం రొంపిచర్ల మండలంలో రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి డా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. రొంపిచెర్ల మండల పరధిలో రూ.17.35 కోట్లతో ప్రభుత్వ భవనాలు, విద్యుత్ సబ్ స్టేషన్ లు, ఆర్ ఓ ప్లాంట్ లను మంత్రి ప్రారంభించారు. బండకిందపల్లి వద్ద 3.29 కోట్లతో, మోటుమల్లెల లోని పెండ్లి కనమగుడి వద్ద రూ.3.30 కోట్లతో నిర్మించిన సబ్ స్టేషన్ లు, రూ.20.80 లక్షల అంచనా వ్యయం తో బండకింద పల్లి, చెంచమరెడ్డి గారి పల్లె, చిచ్చిలివారి పల్లె లలో వై. యస్. ఆర్ హెల్త్ క్లినిక్ లు, బండకింద పల్లె లో రూ.12 లక్షలతో అంగన్వాడీ కేంద్రం, బొమ్మయ్యగారి పల్లె లో రూ.7.76 కోట్లతో నిర్మించిన మోడల్ స్కూల్, హాస్టల్, సి. సి. రోడ్డు లను , బొమ్మయ్యగారిపల్లె, చెంచమరెడ్డి గారి పల్లె లలో రూ.23.94 కోట్లతో రెండు రైతు భరోసా కేంద్రాలను, రొంపిచెర్ల షాదీ మహల్ వీధి లో రూ.1.20 కోట్లతో నిర్మించిన షాదీ మహల్ ను, చెంచమరెడ్డి గారి పల్లె లో రూ.43.60 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని, రొంపిచెర్ల చిన్న మసీదు వీధి లో రూ.8.20 లక్షలతో, మోటుమల్లెల పాలెం లో రూ.5 లక్షలతో, వంకి రెడ్డి గారి పల్లె లో రూ.5 లక్షలతో ఆర్ ఓ ప్లాంట్ లను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చొరవతో రొంపిచర్ల మండలంలో దాదాపు రూ.17కోట్లతో విద్యుత్ సబ్ స్టేషన్లు, అర్ఓ ప్లాంట్లు, హెల్త్ క్లినిక్స్ లాంటి అభివృద్ధి పనులను ప్రారంభించుకున్నామన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పాలన చేస్తూ ముందుకు సాగుతున్నారని, ముఖ్యమంత్రి చూపుతున్న ప్రత్యేక శ్రద్దతోనే పుంగనూరు నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమైందనన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని, నాణ్యమైన విద్యుత్ అందించేందుకు అనేక ప్రాంతాల్లో కోట్ల రూపాయలు వెచ్చించి విద్యుత్ సబ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే ప్రతి గ్రామంలో రోడ్లు వేసి అబివృద్ధి చేశామని, పుంగనూరు నియోజకవర్గంలో ఇంటింటికీ కుళాయి ద్వారా అందించేందుకు ఇప్పటికే ప్రతి గ్రామంలో ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మిస్తున్నామని, ఈ ప్రాంతంలో సాగు, త్రాగు నీటి అవసరాలను తీర్చేందుకు ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గంలోని గండికోట నుండి నీటిని అందిస్తామని గొప్ప మనస్సు చాటుకున్నారన్నారు. కులం, మతం, ప్రాంతం, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం లో జెడ్ పి సి ఈ ఓ ప్రభాకర్ రెడ్డి, డి పి ఓ లక్ష్మీ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళి కృష్ణ, డి ఎం అండ్ హెచ్ ఓ డా. ప్రభావతి దేవి, ఇతర జిల్లా స్థాయి అధికారులు, తహశీల్దార్ అమరనాథ్, ఎం పి డి ఓ రాజేంద్ర, ఎం పి పి చిచ్చిలి పురుషోత్తమ రెడ్డి, జెడ్పిటిసి చిచ్చిలి రెడ్డీశ్వర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.