కాపులను పేదరికం నుంచి బయటపడేలా చేస్తాం
కాకినాడ సెజ్‌లో కాలుష్యం లేని పరిశ్రమలను ఏర్పాటు చేస్తాం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్
ఎస్. అన్నవరం సాయివేదిక వద్ద కాపు సామాజికవర్గం ప్రతినిధులతో ముఖాముఖి సమావేశంలో పాల్గొన్న నారా లోకేష్
తుని : టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ల జోడీ బ్లాక్‌బస్టర్ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా తునిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక ఎమ్మెల్యేతో కుమ్మక్కై అవినీతికి పాల్పడిన అధికారులను వదిలిపెట్టబోనని హెచ్చరించారు. అవినీతికి పాల్పడిన ఉద్యోగులను డిస్మిస్ చేసి జైలుకు పంపుతామని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేషన్ ద్వారా కాపులను పేదరికం నుంచి బయటపడేలా చేస్తానని నారా లోకేశ్ హామీ ఇచ్చారు. ‘‘కాపు రిజర్వేషన్ల కోసం మంత్రి రాజాను నిలదీయండి. బీసీలకు ఇబ్బంది లేకుండా కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి 5 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు టీడీపీ కట్టుబడి ఉంది. కాకినాడ సెజ్‌లో కాలుష్యం లేని పరిశ్రమలను ఏర్పాటు చేస్తాం. స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తామని నారా లోకేశ్ అన్నారు.
కాపులకు రాజకీయంగా తగిన ప్రాధాన్యత ఇవ్వాలి : కాపులకు టిడిపి ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్లు జగన్ రద్దు చేసాడు. మమ్మలని మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆదుకోవాలి. కాపు కళ్యాణ మండపాలు, కాపు భవనాలు లేక ఇబ్బంది పడుతున్నాం. జగన్ పాలనలో కాపు కార్పొరేషన్ ని నిర్వీర్యం చేసాడు. ఒక్క రుణం కూడా ఇవ్వలేదు. జగన్ ఏడాదికి రూ.2 వేల కోట్లు ఇస్తానని మోసం చేసాడు. కనీసం కార్పొరేషన్ లో కుర్చీ, టేబుల్ లేని పరిస్థితి. అమ్మ ఒడి, పెన్షన్ లాంటి సంక్షేమ పథకాలు మా ఖాతా లో రాస్తున్నారు. శాసనసభ్యుడు రాజా ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ ని కూడా చంపాడు, టిడిపి నేత శేషగిరి పై కూడా హత్యాయత్నం జరిగింది. నియోజకవర్గం లో భూములు, ఇసుక దోపిడీ చేస్తున్నాడు. కాపులకు రాజకీయంగా తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. జగన్ కాపులకు తీవ్ర అన్యాయం చేస్తున్నా వైసిపి లో ఉన్న కాపు శాసనసభ్యులు కనీసం నోరు విప్పడం లేదు. జగన్ కాపు విద్యార్థులకు ఇచ్చిన విదేశీ విద్య, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కోసం శిక్షణ ఆపేసాడు. జగన్ అందరికీ ఇస్తానని చెప్పిన కాపు నేస్తం కూడా కరెంట్ బిల్లు, ఇతర కారణాలతో ఇవ్వడం లేదు. టిడిపి హయాంలో స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కాపు సామాజికవర్గం యువత ట్రైనింగ్ తీసుకునే వారు ఇప్పుడు జగన్ స్కిల్ డెవలప్మెంట్ ని నిర్వీర్యం చేశారని తుని నియోజకవర్గం కాపు ప్రతినిధులు లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు.
జగన్ కాపులను నమ్మించి ద్రోహం చేసాడు : నారా లోకేష్ మాట్లాడుతూ కాపులకు కష్టపడే తత్వం ఉంది. మీరు కష్టాన్ని నమ్ముకున్న వారు. దాహంగా ఉంది మంచి నీరు ఇవ్వండి అంటే చల్లటి మజ్జిగ ఇచ్చి పంపే గొప్ప గుణం ఉన్న వారు కాపు సోదరులు. సామాజిక సేవ లో ముందు ఉండేది కాపులు. కాపులను ఆర్థికంగానూ, రాజకీయం లోనూ ప్రోత్సహించింది టిడిపి. కాపులకు ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంది చంద్రబాబు. కాపులకు కార్పొరేషన్ పెట్టింది టిడిపి. రూ.3 వేల కోట్లు కాపుల సంక్షేమం కోసం ఖర్చు చేసింది టిడిపి. కాపు విద్యార్థులకు విదేశీ విద్య పథకం ద్వారా రూ.10 లక్షల నుండి రూ.20 లక్షల ఆర్ధిక సాయం అందించింది చంద్రబాబు. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు రూ.18 వేలు ఆర్ధిక సాయం అందించింది టిడిపి. కాపులకు కీలక పదవులు ఇచ్చింది టిడిపి మాత్రమే. బీసీలకు ఇబ్బంది లేకుండా కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఇచ్చింది టిడిపి. జగన్ కాపులను నమ్మించి ద్రోహం చేసాడు. కార్పొరేషన్ కి ఏడాదికి 2 వేల కోట్లు 5 ఏళ్లలో 10 వేల కోట్లు అన్నాడు. ఐదేళ్లలో కనీసం కార్పొరేషన్ ద్వారా 10 రూపాయిలు ఇవ్వలేదు. జగన్ కాపు కార్పొరేషన్ నిర్వీర్యం చేసాడు. జగన్ కాపుల రిజర్వేషన్లు రద్దు చేశారని ఆరోపించారు.
మూడు నెలల్లో సైకో ప్రభుత్వం పోతుంది : తుని ఎమ్మెల్యే మాయా రాజా కాపులకు అన్యాయం జరుగుతున్నా ఏనాడూ జగన్ ని ప్రశ్నించలేదు. జగన్ విదేశీ విద్య రద్దు చేసాడు. ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వారికి ఇచ్చే ఆర్ధిక సాయాన్ని కూడా రద్దు చేసాడు. కాపుల కోసం కాపు భవనాలు, కళ్యాణ మండపాలు కట్టింది టిడిపి. జిల్లా స్థాయిలో 5 కోట్లు, నియోజకవర్గం స్థాయిలో 1 కోటి రూపాయలతో కాపు భవనాలు ఏర్పాటు చేసింది టిడిపి. టిడిపి – జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే దామాషా ప్రకారం కాపు భవనాలు, కళ్యాణ మండపాలు ఏర్పాటు చేస్తాం. టిడిపి హయాంలో ప్రారంభించిన కాపు భవనల నిర్మాణం ఆపేసింది. దాడిశెట్టి రాజా అక్రమాలు అన్ని ఇన్ని కావు.. జర్నలిస్ట్ హత్య, శేషగిరి పై దాడి, అక్రమాలు పై సీబీఐ కేసు వేసి శిక్ష పడేలా చేస్తాం. తుని లో జరిగిన భూ దందా, ఇసుక అక్రమాలు, అవినీతి పై విచారణ జరిపి వడ్డీతో సహా మాయా రాజా తో కట్టిస్తాం. అధికారంలోకి వచ్చిన వెంటనే విదేశీ విద్య పథకం అమలు చేస్తాం. జగన్ అమ్మ ఒడి, పెన్షన్, ఫీజు రీయింబర్స్మెంట్ కూడా కాపుల సంక్షేమం ఖాతాలో రాస్తున్నాడు. కాపులకు ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంది టిడిపి. కాపులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నిలబెట్టుకోనిది జగన్. ప్రభుత్వం వచ్చిన వెంటనే కాపు కార్పొరేషన్ ని బలోపేతం చేస్తాం. కాపులను మరింతగా రాజకీయంగా ప్రోత్సహిస్తాం. గతంలో టిడిపి బిసిలకు ఇబ్బంది లేకుండా కాపులకు కల్పించిన 5 శాతం రిజర్వేషన్లు అమలు అయ్యేలా చూస్తాం. గతంలో చేసిన తీర్మానానికి కట్టుబడి ఉన్నాం. జగన్ కులాల మధ్య చిచ్చు పెట్టి రాక్షస ఆనందం పొందుతున్నాడు. మూడు నెలల్లో సైకో ప్రభుత్వం పోతుందన్నారు.