విజయనగరం : టీడీపీ యువనేత లోకేష్ పాదయాత్ర ముగింపు సభలోనే ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తామని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బాలకృష్ణతో పాటు ఐదు లక్షల మంది హాజరవుతారన్నారు. పది రైళ్లు ఇప్పటికే బుక్ చేశామన్నారు. బస్సుల కోసం అన్ని ఆర్టీసీ డిపోలకు లేఖలు రాస్తామన్నారు. యువతకు భరోసా కల్పించాలని లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభిస్తే అన్ని వర్గాలకు ఆధారమైందన్నారు. యువగళం పాదయాత్రను అడ్డుకోవటానికి జగన్ రెడ్డి సర్కారు అడుగడుగున ఆటంకాలు సృష్టించిందని మండిపడ్డారు. ఈ రోజు వరకు 220 రోజుల్లో 3,000 వేల కిలోమీటర్లు లోకేష్ పాద యాత్ర ఓ చరిత్ర అని అన్నారు. అనివార్య కారణాలు వలన శ్రీకాకుళం వరకు కొనసాగించటం లేదన్నారు. విశాఖ ఏయూ మైదాంలో సభ పెట్టాలనుకుంటే జగన్ అడ్డుకోవటం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 18న పాదయాత్ర ముగించి 20న మధ్యాహ్నం రెండు గంటలకు భోగాపురం మండలం పోలిపల్లిలో పాదయాత్ర ముగింపు సభ నిర్వహిస్తామని అచ్చెన్నాయుడు వెల్లడించారు.
[https://bloomtimes.org/images/srilekha_/acchemnayudu.jpg]