తణుకు : రాష్ట్రంలో కాపుల అభివృద్ధి, సంక్షేమంతో పాటు వారి ఆత్మ గౌరవం, పెంచేలా ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు చెప్పారు. ఆదివారం తణుకు మండలం తేతలి గ్రామంలో నూతనంగా నిర్మించిన కాపు సామాజిక భవనాన్ని ప్రారంభించారు. అనంతరం తేతలి గ్రామంలో కార్తీకమాసం సందర్భంగా కాపు వనసమారాధన కార్యక్రమాల్లో మంత్రి పాల్గొని మాట్లాడారు. తణుకు నియోజకవర్గంలో గత ప్రభుత్వం హయాంలో వంగవీటి రంగా విగ్రహాల ఏర్పాటుకు అనుమతుల పేరుతో ఏర్పాటు చేయకుండా ఆడ్డుకున్నారని, తాను ఎమ్మెల్యే గా తణుకు పట్టణంలో వివిధ గ్రామాల్లో సొంత నిధులతో విగ్రహాల ఏర్పాటు చేశామని చెప్పారు. తణుకు పట్టణంలోని ప్రధాన సెంటర్ వెంకటేశ్వర దియేటర్ సెంటర్లో వంగవీటి మోహన రంగా రావు విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతోపాటు ఆరోడ్డుకు రంగా మార్గ్ గా నామకరణ చేశామని చెప్పారు. వీటితో పాటు కాపు కార్పోరేషన్ ద్వారా అనేక మందికి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు.
అనంతరం తణుకు వెంకటేశ్వర ధియేటర్ సెంటర్లో నూతనంగా నిర్మించిన రంగా రోడ్డును ప్రారంభించారు. అనంతరం తణుకు పట్టణ కాపు సంఘం, విశ్వబ్రాహ్మణ సంఘం, శెట్టి బలిజ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వనసమారాధన కార్యక్రమాల్లో మంత్రి కారుమూరి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా కాపు సంఘం అధ్యక్షుడు చినిమిల్లి వెంకట్రాయుడు, మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు బోడపాటి వీర్రాజు, పట్టణ కాపు సంఘం అధ్యక్షుడు వంటెద్దు ఈశ్వర ప్రసాద్, గాజుల కాశీ, ఎంపీపీ రుద్ర ధనరాజు, అత్తిలి జెడ్పీటీసీ అడ్డాల జానకి, అత్తిలి మండల అధ్యక్షుడు పైబోయిన సత్యనారాయణ, అత్తిలి ఏఎంసీ చైర్మన్ బుద్దరాతి భరణి ప్రసాద్, ఇరగవరం జెడ్పీటీసీ అంజిబాబు, ఎంపిపి మంగతాయారు, నాయకులు ఇండుగపల్లి బలరామ కృష్ణ, తణుకు పట్టణ అధ్యక్షుడు మంగెన సూర్య, వివిధ గ్రామాలకు చెందిన నాయకులు, వివిధ కుల సంఘాల పెద్దలు పాల్గొన్నారు.