నేను దళితుడిని.. నేను మంత్రినయ్యా. కడప నుంచి ఓ మైనార్టీని డిప్యూటీ సీఎంను చేశారు. కులం, మతం చూడకుండా అందరిని సీఎం జగన్ అభివృద్ది చేశారు. చంద్రబాబు మాత్రం కులాల మధ్య చిచ్చు పెట్టారు. కులాలను విడగొడితే వైఎస్సార్సీపీ ఓడిపోతుందని చంద్రబాబు అనుకుంటున్నారని మంత్రి ఆదిమూలపు దుయ్యబట్టారు. చంద్రబాబుకు ప్రజలు మళ్లీ బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్ కల్యాణ్ తెలంగాణలో నోటాతో పోటీ పడ్డారు. తెలుగు ప్రజలు బాబును, పవన్ కళ్యాణ్‌ను నమ్మడం లేదని ఆదిమూలపు అన్నారు. చంద్రబాబును నమ్మొద్దని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అంటూ దళితులను అవమానించిన వ్యక్తి చంద్రబాబు. అదే సీఎం జగన్ మాత్రం అందరిని అక్కున చేర్చుకున్నారు. చంద్రబాబు హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలపై అధిక దాడులు జరిగాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చాలా తగ్గుముఖం పట్టాయి. ఎట్టి పరిస్దితుల్లో చంద్రబాబును నమ్మొద్దని కోరారు.