హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, పలువురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, మంత్రులకు నేడు శాఖలను కేటాయించారు. మంత్రుల శాఖలపై సీఎం రేవంత్ ఇప్పటికే అధిష్టానంతో చర్చలు జరిపారు. దీంతో, ఎవరికి ఏ శాఖ ఇవ్వాలనే అంశంపై క్లారిటీ తీసుకొని కేటాయింపు జరిగింది.
మంత్రులు, వారి శాఖలు ఇవే
మల్లు భట్టి విక్రమార్క: ఆర్థిక శాఖ
దామోదర రాజనర్సింహ: ఆరోగ్యశాఖ
ఉత్తమ్‌కుమార్ రెడ్డి: సివిల్ సప్లై, నీటి పారుదల
సీతక్క: పంచాయతీరాజ్
శ్రీధర్‌బాబు: ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాలు
కొండా సురేఖ: అటవీ శాఖ
పొంగులేటి శ్రీనివాస్: సమాచార శాఖ
కోమటిరెడ్డి వెంకటరెడ్డి: ఆర్ అండ్ బీ
జూపల్లి: ఎక్సైజ్
తుమ్మల నాగేశ్వరరావు: వ్యవసాయ శాఖ
పొన్నం ప్రభాకర్: రవాణా శాఖ.