విజయవాడ : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్ర పర్యటన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత ఆత్మీయ స్వాగతం పలికారు. గన్నవరం విమానాశ్రయంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ కు హోంమంత్రి తానేటి వనిత పుష్ప గుచ్ఛం ఇచ్చి సాదర స్వాగతం పలికారు. అనంతరం విజయవాడ రాయనపాడులో వికసిత్ సంకల్ప యాత్రను నిర్మలా సీతారామన్ ప్రారంభించారు.