విశాఖపట్నం : ఫిషింగ్ హార్బర్ అగ్నిప్రమాద ఘటన దురదృష్టకరమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. ‘‘అధికారంలో ఉన్నా లేకపోయినా మత్స్యకారులను ఎప్పుడూ ఆదుకునేది టీడీపీయే. బోట్లు కాలిపోయిన వారికి లక్ష రూపాయలు, పాక్షికంగా బోట్లు కాలిపోయిన వారికి రూ.50 వేలు ఇస్తున్నాం. జీవనోపాధి కోల్పోయన బాధితులను ఆదుకుంటున్నాం. మత్స్యకారులను అన్ని విధాలుగా ఆదుకోవడంలో వైసీపీ సర్కార్ విఫలం అయింది. టీడీపీ స్పందించిన తర్వాతే ఈ కుంభకర్ణుడు స్పందించాడు. తుపాన్ బాధితులను చంద్రబాబు పరామర్శిస్తుంటే జగన్ ఇప్పుడు నిద్ర లేచాడు. బాధితులను ప్రభుత్వం ఆదుకోవడంలో పూర్తిగా విఫలం అయింది. అగ్నిప్రమాదం ఘటనపై మొదట స్పందించి ఆర్థిక సహాయం చేసింది జనసేన పార్టీనే. టీడీపీ-జనసేన ఒక్కటయ్యాయి. ఈ రెండు పార్టీలను ప్రజలు ఆదరించాలని కోరారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా టీడీపీ-జనసేన పార్టీలు అధికారంలోకి వస్తాయి. అప్పుడు బాధితులకు కొత్త బోట్లు కొనిస్తాం. పేరుకే కార్పొరేషన్లు.. ఒక్క లోన్ కూడా ఇవ్వలేదు. వీటివలన ఎవరికీ ఉపయోగం లేదని అచ్చెన్నాయుడు చెప్పారు.