ఐక్యత మీరు చూపించండి..న్యాయమైన సమస్యల పరిష్కారం ఏపీ జేఏసీ అమరావతి భాధ్యత తీసుకుంటుంది
మహాసభ వేదికగా నూతన రాష్ట్ర కమిటీ ఆవిర్భావం
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మహాసభకు వేలాదిగా తరలి రండి
ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు, సెక్రెటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కే.సుమన్
విజయవాడ : ఏపీ జెఎసి అమరావతి అనుబంధంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ 10వ తేదీన విజయవాడ జింఖానా గ్రౌండ్స్, గాంధీనగర్ లో రాష్ట్రస్థాయి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ప్రథమ మహాసభ జరుగుతుందని ఈ మహాసభకు రాష్ట్రంలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరూ విచ్చేసి ఐక్యత చూపుతూ జయప్రదం చేయాలని ఏపీ జెఎసి అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, రాష్ట్రప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదర రావు, పిలుపునిచ్చారు. మహాసభ విజయవంతం చేయాలని కోరుతూ శుక్రవారం రెవెన్యూ భవన్లో కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర చైర్మన్ కే సుమన్, ప్రధాన కార్యదర్శి అల్లం సురేష్ బాబు ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. మీడియాను ఉద్దేశించి ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ ఏకం చేసి ఒక సంఘంగా ఏర్పాటు చేయాలని ఏపీ జెఎసి అమరావతి అనుబంధంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ వారు 26 జిల్లాల్లో జిల్లా కమిటీలను పూర్తిచేసి డిసెంబర్ 10వ తేదీన రాష్ట్ర కమిటీ ఎన్నికతో పాటు అదే రోజు రాష్ట్ర స్థాయి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ప్రధమ మహాసభ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఔట్ సోర్శింగు ఉద్యోగుల రాష్ట్ర స్థాయి ప్రథమ మహా సభను విజయవంతం చేయాల్సిన భాధ్యత ప్రతి ఒక్క ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి ఉందని తెలిపారు. ఈ మహా సభను విజయవంతం చేయడం ద్వారా మన ఐక్యత ప్రభుత్వానికి తెలుస్తుందని, తద్వారా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారం సులభం అవుతుందని తెలిపారు.
ఎలాంటి గ్రూపులతో, వర్గాలతో సంబందం లేకుండా అందరూ ఐక్యంగా కలిసి వచ్చే విధంగా మీరు ఆదివారం ఒక్క రోజు నాలుగు గంటలు కేటాయిస్తే, రానున్న మూడు సంవ్సరాలపాటు నూతనంగా ఏర్పడే రాష్ట్ర సంఘం నాయకత్వం చూసుకుంటుందని, ప్రభుత్వం తో చర్చించి, ఒప్పించి మన న్యాయమైన సమస్యల పరిష్కారం భాధ్యత ఏపీ జేఏసీ అమరావతి తీసుకుంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తూ ఏజెన్సీల దోపిడీకి బలి పశువులైన ఉద్యోగులను వారి భారీ నుండి విముక్తి పరిచి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం కోసం ఆప్కాస్ ను ఏర్పాటు చేసి ఉద్యోగులకు ప్రతినెలా వేతనాలు అందిస్తూ ప్రభుత్వం మేలు చేసిందన్నారు. మహాసభ వేదికగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు కూడా తెలపనున్నట్లు బొప్పరాజు తెలిపారు. ఆప్కాస్ ఏర్పాటు అయినప్పటికీ ఉద్యోగులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని దీనికి తోడు ప్రభుత్వ పథకాలు ఇతర రాయితీలు నిలిపివేయడం జరిగిందన్నారు.
ఈసమావేశంలో పలిశెట్టి దామోదరరావు మాట్లాడూతూ అనేక సంవత్సరాలుగా ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న సగటు ఔట్సోర్సింగ్ చిత్తశుద్ధితో ప్రభుత్వం అనుమతితో రెగ్యూలర్ ఉద్యోగుల ఖాళీలలో పనిచేస్తున్నప్పటికీ వీరంతా అభద్రతాభావంతో కనీస వేతనం లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని,రెగ్యూలర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులు కొందరిని ఇప్పటికీ ఆప్కోస్ లోకి చేర్చలేదని, కనుక అందరిని ఆప్కాస్ లో కలిపెందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఔట్ సోర్శింగు ఉద్యోగులకు కూడా రిటైర్ మెంటు అయ్యేంతవరకు ఉద్యోగం నుండి తొలగిస్తారన్న భయంలేకుండా ఉండేలా ఉద్యోగభధ్రత కల్పించాలే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఈ మహాసభ ప్రభుత్వనికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్నదికాదని ఔట్ సోర్శింగు ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొనివెళ్లేందుకే నని దామోదరరావు తెలిపారు. ఈ రాష్ట్రమహాసభ వేదికగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న న్యాయమైన సమస్యల సాధన కొరకు మహాసభ వేదికను ఉపయోగించుకుని వేలాదిగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు హాజరై మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపిజెఏసి అమరావతి రాష్ట్రనాయకులు వి.వి.మురళికృష్టనాయుడు, బి.కిశోర్ , ఏ.సాంబశివరావు, వై.శ్రీనివాసరావు తోపాటు కాంట్రాక్టు & ఔట్ సోర్శింగు ఉద్యోగుల అసోషియేషన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి అల్లం సురేష్,బానుజీరావు,అనీల్,మదు,గురునాధ్,శ్యామ్ ప్రసాద్, విలీయమ్, దీపక్ పాల్గొన్నారు.