వెలగపూడి : ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ.. ఓట్ల అవకతవకలకు పాల్పడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి చంద్రబాబు లేఖ రాశారు. ఎలక్టోరల్ మాన్యువల్ 2023 ప్రకారం మార్పులు జరగట్లేదు. క్షుణ్నంగా పరిశీలించి డబుల్ ఎంట్రీలను తొలగించాలి. ఇప్పటికీ డబుల్ ఎంట్రీలు గుర్తిస్తూనే ఉన్నారు. ఓటరు జాబితాలో ఇంకా మరణించిన వారి ఓట్లున్నాయి. ఆన్లైన్లో ఇష్టానుసారంగా ఓట్లు నమోదు చేస్తున్నారు. ప్రతిపక్షాల ఓట్లను తొలగిస్తున్నారు. మా అభ్యంతరాలపై ఇప్పటికీ దృష్టిపెట్టలేదు. ఓట్లను తొలగించాలంటే కచ్చితమైన ఆధారాలు చూపించాలి. ఎలాంటి విచారణ లేకుండానే ఓట్లను తొలగిస్తున్నారు. ఓట్ల అవకతవకలు పునరావృతం కాకుండా ఈసీ చూడాలని ఈసీకి రాసిన లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.
[https://bloomtimes.org/images/srilekha_/CBN.jpg]
[https://bloomtimes.org/images/srilekha_/CBN.jpg]