టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన మాజీ మంత్రి పొంగూరు నారాయణ
నెల్లూరు 6, 7వ డివిజన్లలో ఓటర్ల జాబితాపై రివ్యూ మీటింగ్
నెల్లూరు : తెలుగుదేశంపార్టీకి అండదండ, బలం బలహీనత కార్యకర్తలే అని, పార్టీ శ్రేణుల కోసం అధిష్టానం ఏమి చేసేందుకైనా సిద్ధమేనని మాజీ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు 6, 7వ డివిజన్ల పరిధి జీనిగలవారివీధిలోని టీడీపీ కార్యాలయంలో నారాయణ శుక్రవారం నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్తో కలిసి బీఎల్ఏలు, బూత్ కన్వీనర్లు, టీడీపీ శ్రేణులతో ఓటర్ల జాబితాపై రివ్యూ సమావేశం నిర్వహించారు. జాబితాలో నూతన ఓటర్లను చేర్పించడం, సవరణలు, మార్పులపై టీడీపీ నాయకులకు ఆయన దిశానిర్దేశం చేశారు. స్వేచ్ఛాయుత ఎలక్షన్ జరగాలంటే దొంగ ఓట్లను అరికట్టాలని సూచించారు. అన్ని డివిజన్లలో సమగ్రంగా ఓటర్ల జాబితాపై పరిశీలన చేసి…, క్షేత్రస్థాయిలో టీడీపీ మ్యానిఫెస్టోపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి నారాయణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ శ్రేణుల శ్రేయస్సే ధ్యేయంగా అధిష్టానం నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పార్టీకి అండదండ, బలం బలహీనత కార్యకర్తలే అని తెలిపారు. ప్రజాశ్రేయస్సు కోసం టీడీపీ శ్రేణులు అహర్నిశలు శ్రమించాలని సూచించారు. ప్రజల ఆశీర్వదంతో రానున్న 2024 ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ముందుకెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అందుకు ప్రతి కార్యకర్త సైనికుల్లా పని చేయాలని దిశానిర్దేశం చేశారు. అన్ని డివిజన్ల పరిధిలో ఓటర్ల జాబితాపై సమగ్ర పరిశీలన చేపట్టాలన్నారు. ఎక్కడ కూడా దొంగ ఓటు అనేదే లేకుండా చేసేందుకు క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. పగడ్బంధీగా ఓటర్ల జాబితాపై సర్వే చేయాలని సూచించారు. అదేవిధంగా నూతన ఓటర్ల చేరిక, చేర్పులు, మార్పుల గురించి ప్రజలతో చర్చించాలన్నారు. ఎవరికి ఎక్కడ ఇబ్బంది వచ్చినా టీడీపీ పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో నగర టీడీపీ అధ్యక్షులు మామిడాల మధు, నగర మహిళా అధ్యక్షురాలు కపిర రేవతి, రాష్ట్ర కార్యదర్శి, క్లస్టర్ ఇంఛార్జి పమ్మిడి రవి కుమార్ చౌదరి, బీఎల్ఏలు, బూత్కన్వీనర్లు, టీడీపీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.