ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిటీ వచ్చే చర్యలు తీసుకుంటాం
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
విజయవాడ : రైతులకు ఎటువంటి నష్టం కలుగకుండా ప్రభుత్వం తరుపున అన్ని చర్యలు తీసుకోవడం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. గురువారం పెరవల్లి మండలం పెరవల్లి కానూరు ముసలిమర్రు తీపర్రు గ్రామాల్లో మిచాంగ్ తూఫాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షాల వలన నేలవాలిన వరిపంటలను పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వర రావు, నిడదవోలు శాసనసభ్యులు జి.శ్రీనివాస్ నాయుడు తో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతులకు ఎటువంటి నష్టం కలుగకుండా ప్రభుత్వం తరుపున అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ధాన్యంలో తేమశాతం తేడాను పరిగణలోకి తీసుకొని రైతుకి, మిల్లర్లకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పారు. రైతులు పంపిన ధాన్యాన్ని మిల్లర్లు త్వరితగతిని అన్ లోడింగ్ అయ్యేలా చూడాలన్నారు. ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ విధానంలో ధాన్యం కొనుగోలు జరుగుతుందని తెలిపారు. రైతులను ఇబ్బందులకు గురి చేస్తే మిల్లర్ల పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
రైతులు నుండి ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామన్నారు. నష్టపోకుండా వారి పంట నష్టపరిహారాన్ని లెక్కించి ఆ మేరకు ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ అందించే విధంగా ప్రభుత్వం రైతాంగానికి అండగా నిలుస్తుందన్నారు. మిచౌంగ్ తుఫాను వలన వరితోపాటు ఉద్యాన పంటలకు సంబంధించి అరటి ఇతర పంటలకు దెబ్బతిన్న వాటిని అధికారి యంత్రాంగం గుర్తించి ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నారు. శాసనసభ్యులు జి.శ్రీనివాస నాయుడు మాట్లాడుతూ రైతులకు అండగా ఈ ప్రభుత్వం ఉందని రైతాంగం ఎవరు అధైర్య పడవద్దని చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటులో ఉండి వారికి అండగా నిలవాలన్నారు. అన్ని రైతు భరోసా కేంద్రాల వద్ద గోనె సంచులు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఏ ఒక్క రైతు నష్టపోకుండా ప్రతి గింజ కొని రైస్ మిల్లులకు తరలించే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. నిన్న సాయంత్రం నుంచి కోసిన ధాన్యం మాత్రమే పొలాల్లో ఉన్నాయి, దాన్ని కూడా త్వరితగతిన తరలించి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. రైతులు అధైర్య పడాల్సిన పనిలేదని ప్రభుత్వం వారికి తోడుగా ఉంటుందని రైతులకు ధైర్యం చెప్పారు. నియోజకవర్గంలో టోరంటో వంటి సుడిగాలుల వలన వరితోపాటు అరటి కూడా దెబ్బన్నదని, రైతులకు ఇన్సూరెన్స్ తో పాటు ఇన్పుట్ సబ్సిడీ వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ పర్యటనలో జిల్లా వ్యవసాయాధికారి ఎస్ మాధవరావు, సివిల్ సప్లైస్ డియం రాజు, పెరవలి మండల మండల వ్యవసాయశాఖ అధికారి, పెరవలి మండల ఎంపీపీ, స్టేట్ డైరెక్టర్, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామాల నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.