అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన * శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయ పునఃనిర్మాణానికి రూ. 5.60 కోట్లు * మెగా సోలార్ విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు రూ. 5.66 కోట్లు * సీఎం జగన్‌కు ఆలయ మర్యాదలతో స్వాగతం
విజయవాడ : శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్ధానంలో రూ.216 కోట్ల విలువైన పనులకు భూమిపూజ నిర్వహించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం వైయస్.జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం కనకదుర్గ అమ్మవారిని ముఖ్యమంత్రి దర్శించుకున్నారు. సీఎం వైయస్.జగన్ మోహన్ రెడ్డికి వేదపండితులు వేద ఆశీర్వచనం అందించారు. దర్శనం అనంతరం ముఖ్యమంత్రి వైయస్.జగన్‌కు తీర్ధప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని డిప్యూటీసీఎం(దేవాదాయశాఖ) కొట్టు సత్యనారాయణ, దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు, దేవాదాయశాఖ కమిషనర్ ఎస్. సత్యనారాయణ, దేవస్ధానం ఈవో కెఎస్ రామరావు, వేదపండితులు అందించారు. కార్యక్రమంలో హోంమంత్రి తానేటి వనిత, ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్టు, ఎమ్మెల్సీ మహమ్మద్ రుహుల్లా, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి వద్ద పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వీటి వ్యయం రూ.216.05 కోట్లుగా అధికారులు అంచనా వేశారు. తొలుత తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయల్దేరిన సీఎం జగన్ విజయవాడ కనక దుర్గానగర్‌కు చేరుకున్నారు. అక్కడ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, దేవాదాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వలైవన్, కమిషనర్ ఎస్.సత్యనారాయణ, దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం పాలకమండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు, ఈవో రామారావు తదితరులు సీఎం జగన్‌కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం దుర్గగుడి మాస్టర్‌ప్లాన్‌లో భాగంగా చేపట్టనున్న అభివృద్ధి పనులకు జగన్ శంకుస్థాపనలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 216 కోట్ల రూపాయలతో కనక దుర్గగుడి అభివృద్ధి కార్యక్రమాలకు గురువారం ఉదయం శంకుస్ధాపనలు చేశారు. శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయ పునఃనిర్మాణానికి రూ. 5.60 కోట్లు, ఇంద్రకీలాద్రిపై కొండ రక్షణ చర్యలపనుల నిమిత్తం రూ. 4.25 కోట్లు, ఎల్టీ ప్యానల్ బోర్డులు, ఎనర్జీ వాటర్ మేనేజ్మెంట్, స్కాడా ఏర్పాటు నిమిత్తం రూ. 3.25 కోట్లు, 2016 పుష్కరాల సమయంలో కూల్చివేసిన ఆలయాల పునర్నిర్మాణంకు రూ 3.87 కోట్లు, మెగా సోలార్ విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు రూ. 5.66 కోట్లు, కొండ దిగువున బొడ్డు నిర్మాణం రూ. 0.23 లక్షలు, కొండ దిగువున తొలిమెట్టు వద్ద ఆంజనేయ స్వామి, వినాయక స్వామి వార్ల ఆలయ నిర్మాణం కోసం రూ. 0.265 కోట్లు, అమ్మవారి అన్న ప్రసాద భవన నిర్మాణానికి రూ.30 కోట్లు, అమ్మవారి ప్రసాదం పోటు భవన నిర్మాణం కోసం రూ. 27 కోట్లు, కనకదుర్గ నగర్ నుంచి మహామండపం వరకు ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ. 13 కోట్లు కేటాయించారు. అలాగే రాజగోపురం ముందు భాగాన మెట్ల నిర్మాణంకు రూ. 15 కోట్లు, మహామండపం వద్ద అదనపు క్యూలైన్ల కోసం రూ. 23.50 కోట్లు, కనక దుర్గ నగర్ వద్ద మహారాజద్వారం నిర్మాణంకు రూ. 7.75 కోట్లు, కనకదుర్గ నగర్ నుంచి మహామండపం వరకు రాజమార్గము అభివృద్ధి నిమిత్తం రూ. 7.50 కోట్లు, కొండపైన పూజా మండపాల నిర్మాణానికి రూ. 7 కోట్లు, మల్లికార్జున మహామండపం క్యూ కాంప్లెక్స్ మార్చుటకు రూ. 18.30 కోట్లు, నూతన కేశఖండనశాల నిర్మాణం నిమిత్తం రూ. 19 కోట్లు, గోశాల అభివృద్ధి నిమిత్తం రూ. 10 కోట్లు, కొండపన యాగశాల కోసం రూ. 5 కోట్లు, కనకదుర్గనగర్‌లో మల్టీ లెవల్ కార్ పార్కింగ్ నిమిత్తం రూ. 33 కోట్లు కేటాయించారు. కాగా అంతకుముందు ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయానికి విచ్చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డికి మేళ తాళాలతో, మంగళ వాయిద్యాలతో కోలాటాల నడుమ మంత్రి కొట్టు సత్యనారాయణ, హోంమంత్రి తానేటి వనిత, మేయర్ భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవినేని అవినాష్, చైర్మన్ కర్నాట రాంబాబు ఘన స్వాగతం పలికారు. ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.