అలాగే రాజగోపురం ముందు భాగాన మెట్ల నిర్మాణంకు రూ. 15 కోట్లు, మహామండపం వద్ద అదనపు క్యూలైన్ల కోసం రూ. 23.50 కోట్లు, కనక దుర్గ నగర్ వద్ద మహారాజద్వారం నిర్మాణంకు రూ. 7.75 కోట్లు, కనకదుర్గ నగర్ నుంచి మహామండపం వరకు రాజమార్గము అభివృద్ధి నిమిత్తం రూ. 7.50 కోట్లు, కొండపైన పూజా మండపాల నిర్మాణానికి రూ. 7 కోట్లు, మల్లికార్జున మహామండపం క్యూ కాంప్లెక్స్ మార్చుటకు రూ. 18.30 కోట్లు, నూతన కేశఖండనశాల నిర్మాణం నిమిత్తం రూ. 19 కోట్లు, గోశాల అభివృద్ధి నిమిత్తం రూ. 10 కోట్లు, కొండపన యాగశాల కోసం రూ. 5 కోట్లు, కనకదుర్గనగర్లో మల్టీ లెవల్ కార్ పార్కింగ్ నిమిత్తం రూ. 33 కోట్లు కేటాయించారు. కాగా అంతకుముందు ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయానికి విచ్చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డికి మేళ తాళాలతో, మంగళ వాయిద్యాలతో కోలాటాల నడుమ మంత్రి కొట్టు సత్యనారాయణ, హోంమంత్రి తానేటి వనిత, మేయర్ భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవినేని అవినాష్, చైర్మన్ కర్నాట రాంబాబు ఘన స్వాగతం పలికారు. ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.