విజయవాడ : భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చూపిన మార్గం ఆదర్శప్రాయమని వైసిపి రాష్ట్ర నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్ కొనియాడారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67 వర్ధంతి కార్యక్రమం బుధవారం భవానిపురం ఆకుల రాజేశ్వరరావు వీదిలో నిర్వహించారు. ముందుగా వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆకుల శ్రీనివాస కుమార్, పొదిలి చంటిబాబు కలసి డాక్టరు బిఆర్ అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆకుల శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ ఇప్పుడు దేశం యావత్ డాక్టరు బిఆర్ అంబేద్కర్ జీవితం మీద తీవ్రమైన చర్చ జరుగుతుందన్నారు. భారత రాజ్యాంగంలో సామ్యవాదం, ప్రజాస్వామ్యం, లౌకికవాదం అనే పదాలను చేర్చడం ద్వారా భారత దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికీ భారతీయ పౌరుడుగా మతానికి, కులానికి, వర్గానికి అతీతంగా నేను భారతీయుడినీ అని ప్రకటించుకునే హక్కు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించారని ఆకుల శ్రీనివాస్ కొనియాడారు. ఈ హక్కును ప్రతిపాదించడానికి ఆయన ఎంతో అధ్యయనం చేశారని, ముఖ్యంగా ఈ వ్యవస్థలో వర్ణానికి, కులానికి,అతీతమైన సమాజాన్ని నిర్మించే ప్రయత్నం చేశారన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా విజయవాడలో సీఎం అంబేద్కర్ 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. దళిత నాయకుడు పొదిలి చంటిబాబు మాట్లాడుతూ దేశం మొత్తం గర్వపడేలా వందల కోట్ల రూపాయలతో విజయవాడ నగరంలో 125 అడుగుల భారీ కాంస్య విగ్రహం నెలకొల్పడం ఈ జాతి అదృష్టంగా భావిస్తున్నామన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలో అంబేద్కర్ ఆలోచనకు అనుగుణంగా పాలన జరుగుతుందని అన్నారు .ప్రభుత్వ సంక్షేమ పదకాలు ప్రజల వద్దకు వెళ్ళడమే అంబేత్కర్ ఆశయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు యాకూబ్ , షేక్ కరీం, అశోక్, శివప్రసాద్ చారి, రవి, షానూర్,ఫణి తదితరులు పాల్గొన్నారు.