అమరావతి : విశాఖలో కార్యాలయాల ఏర్పాటుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ వాదనలు వినిపించారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) వేయాల్సిన అంశాన్ని రిట్ పిటిషన్‌గా దాఖలు చేశారు. అందువల్ల పిటిషన్‌కు విచారణ అర్హత లేదు. ఇది ఫోరమ్ షాపింగ్ కిందకు వస్తుందని ఏజీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మరోవైపు జీవోల అమలు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్లు న్యాయస్థానాన్ని కోరారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం పిటిషన్‌పై తదుపరి విచారణను డిసెంబర్ 8వ తేదీకి వాయిదా వేసింది.