కొవ్వూరు : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్‌కు కొవ్వూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. బుధవారం అంబేద్కర్ వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి హోంమంత్రి వారి క్యాంపు కార్యాలయంలో పూల మాలలు వేసి నివాళులర్పించారు. జోహర్ అంబేద్కర్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం సమ సమాజ స్థాపన కోసం అంబేద్కర్ చేసిన కృషిని నాయకులు కొనియాడారు. నేటి యువత అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకుని, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు నియోజకవర్గ స్థానిక ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నియోజకవర్గంలో స్థానికంగా వైసీపీ నాయకులు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.