కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత కోసమే రాష్ట్ర ప్రథమ మహా సభ
డిసెంబర్ 10న విజయవాడ జింఖానా గ్రౌండ్స్ లో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర ప్రథమ మహాసభ
జయప్రదం చేయాల్సిన భాధ్యత ప్రతి ఒక్క ఔట్ సోర్సింగ్ ఉద్యోగి మీద ఉంది
ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు
గుంటూరు : గుంటూరు రెవెన్యూ భవన్ లో డిసెంబర్ 10వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు విజయవాడ జింఖానా గ్రౌండ్స్ లో జరిగే కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర ప్రథమ మహా సభను విజయవంతం చేసేందుకు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వివధ శాఖలలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నాయకులతో ఏపి జేఏసీ అమరావతి గుంటూరు జిల్లా చైర్మన్ కే.సంగీత రావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉద్యోగులు ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలమని, దీని కోసం ప్రతి ఒక్క ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఎలాంటి తారతమ్యాలు లేకుండా కలిసికట్టుగా ఐక్యంగా కదిలి రావాలని పిలుపునిచ్చారు. 10వ తేదీన విజయవాడ జింఖానా గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న సభలో కాంట్రాక్ట్ , ఔట్సోర్సింగ్ ఉద్యోగులు తమ ఐక్యత చాటాలని కోరారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆప్కోస్ ద్వారా రాష్ట్రంలోని సుమారు లక్ష మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మేలు చేసిందని, ఈ సందర్భంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు.
కాంట్రాక్టు& ఔట్ సోర్సింగ్ రాష్ట్ర స్థాయి కమిటీని కూడా ఆ రోజు ప్రకటన చేస్తామని, మన సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం మన భాధ్యత అని, ప్రధానంగా ఇంకా లక్ష మందికిపైగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆప్కోస్ లోకి రావాల్సి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల్ రామకృష్ణా రెడ్డి , మల్లాది విష్ణు ని కూడా ముఖ్య అతిథులుగా ఆహ్వానించి ఉన్నామని తెలిపారు. అనంతరం రాష్ట్ర సదస్సుకు సంబంధించిన వాల్ పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఏపీ జెఎసి అమరావతి గుంటూరు జిల్లా అధ్యక్షులు కనపర్తి సంగీతరావు, పి.ఏ కిరణ్ కుమార్ జనరల్ సెక్రెటరీ, వెంకటరావు, సెక్రెటరీ ఏపీ ఆర్ ఎస్ ఏ, మల్లేశ్వరరావు, క్లాస్ ఫోర్ ఎంప్లాయిస్ రాష్ట్ర అధ్యక్షుడు, శ్యాం ప్రసాద్ కాంటాక్ట్ , ఔట్సోర్సింగ్ జిల్లా అధ్యక్షుడు, మధుబాబు జిఎంసి కాంటాక్ట్ , ఔట్సో ఔర్సింగ్ ఎంప్లాయిస్ ఇంజనీరింగ్ వర్క్స, అధ్యక్షుడు, నీరజ, రాంబాబు జనరల్ సెక్రెటరీ పలనాడు తదితరులు పాల్గొన్నారు.