నెల్లూరు : ఆంధ్రప్రదేశ్‌లో తీవ్రమైన కరవు నెలకొందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారు. నెల్లూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ పాలన తీరుపై విమర్శలు గుప్పించారు. ఏపీలో 470 కరవు మండలాలు ఉంటే 103 మాత్రమే ప్రకటించారని విమర్శించారు. వరి సేద్యం తగ్గిపోయిందని.. రైతులు ఇతర పంటలు కూడా వేయట్లేదని చెప్పారు. రాష్ట్రంలో కరవు లేని జిల్లానే లేదన్నారు. జగన్ సీఎం అయ్యాక 9 విపత్తులు వచ్చాయని సోమిరెడ్డి మండిపడ్డారు.