విజయవాడ : స్థానిక బ్రాహ్మణ వీధిలో గల మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కార్యాలయంలో సోమవారం రాష్ట్ర ఐటి విభాగం అధ్వర్యంలో ఈ నెల 18న సాయంత్రం 4గంటలకు విజయవాడ లో జరగనున్న జగనన్న ప్రగతి పధం ర్యాలీ పోస్టర్ ను మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ రాష్ట్ర ఐటి విభాగం అధ్వర్యంలో ఈనెల 18న విజయవాడ జగనన్న ప్రగతి పధం పేరుతో గత టీడీపీ హయాంలో జరిగిన పాలన కి ప్రస్తుత జగనన్న హయాంలో జరిగిన పాలన మధ్య తేడాను ప్రజలకు తెలియచేసేందుకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారని, నగరంలో ఉన్న వైసీపీ శ్రేణులు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ వింగ్ కో ఆర్డినేటర్ వేములకొండ తిరుపతి రావు, ఎన్టీఆర్ జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐటీ విభాగం అధ్యక్షులు నల్లమోతు ప్రసన్న బోస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కృష్ణాజిల్లా ఐటీ విభాగం అధ్యక్షులు దోవారి పూర్ణ సాగర్, ఐటీ విభాగం సభ్యులు పాల్గొన్నారు.