20, 21 తేదిలో విజయవాడలో సీపీఐ 30 గంటల దీక్ష
అన్ని రాజకీయపార్టీలు, ప్రజాసంఘాలు, రైతు సంఘాలను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడి * ` సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
విజయవాడ : రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్న కృష్ణాజలాల పున:పంపిణీ గెజిట్ నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా రాష్ట్రంలో కరువు పరిస్థితులను పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ ఈ నెల 20, 21 తేదిలలో సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో విజయవాడలో 30 గంటల నిరసన దీక్ష చేయనున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. సోమవారం స్థానిక చుట్టుగుంటలోని చంద్రం బిల్డింగ్ నుంచి సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని జూమ్ పద్ధతిలో నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి.హరినాథరెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. అనంతరం రామకృష్ణ విలేకర్లతో మాట్లాడుతూ రాష్ట్రంలో కరువు పరిస్థితులు దారుణంగా ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆరోపించారు. 440 మండలాల్లో కరువు తాండవిస్తుంటే కేవలం 103 మండలాలను ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించిందన్నారు. జగన్ ప్రభుత్వం కరువు పరిస్థితిపై కేంద్రానికి నివేదిక పంపించలేదన్నారు. కేంద్ర బృందాలను ఆహ్వానించి కరువు పరిస్థితిని కేంద్రం దృష్టికి తీసురాలేదని మండిపడ్డారు. ఆయకట్టు ప్రాంతాలలో కూడా సాగునీరు లేక లక్షలాది ఎకరాలు బీడు భూములుగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అన్ని రకాల రైతు రుణాలను మాఫి చేసి ఆదుకోవాలని కోరారు. వలసల నివారణకు గ్రామీణ ఉపాధి హామి పనులను తక్షణం ప్రాంభించాలని డిమాండ్ చేశారు. కరువు పరిస్థితిపై రాష్ట్ర మంత్రులు, వైసీపీ నాయకులు నోరెత్తకపోవటం దారుణం అన్నారు. కృష్ణానది జలాల పున:పంపిణీపై కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవటాన్ని రామకృష్ణ తప్పుబట్టారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ఎన్నికల్లో లబ్దిపొందటానికి చేసిన కుట్ర కృష్ణాజలాల పున:పంపిణీ అంశాన్ని తీసుకువచ్చారని ఆరోపించారు. కర్నాటక ఎన్నికల్లో లబ్దిపొందేందుకు బీజేపీ ఆనాడు ఎగువ భద్ర ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి రూ.5,300 కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని తెలియజేస్తూ సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నవంబరు 20, 21 తేదిలలో 30 గంటల నరసన దీక్షలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. 21వ తేది అన్ని రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, ప్రజాసంఘాల ప్రతినిధులు హాజరై మద్దతు ప్రకటించనున్నట్లు తెలిపారు.
మహిళా సమాఖ్య రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి: ఈ నెల 17, 18, 19తేదిలలో నంద్యాలలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య 15వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చేపట్టిన మహాధర్నా సందర్భంగా ఈ నెల 27, 28 తేదిలలో విజయవాడలో నిర్వహించతలపెట్టిన మహాధర్నాకు సీపీఐ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జేవీ సత్యనారాయణమూర్తి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జల్లి విల్సన్, అక్కినేని వనజలతో పాటు సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.