అమరావతి : విద్యాశాఖ ప్రయోగశాలగా మారిందని, జీవో నంబర్ 282 దానికి ఉదాహరణ అని మాజీ మంత్రి జవహర్ వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ఒకసారి మినహాయింపు పేరుతో అడ్డదారులు ఏర్పాటు చేశారని విమర్శించారు. అవగాహన లేని అధికారులతో విద్యాశాఖను నింపాలనుకుంటున్నారని మండిపడ్డారు. డీఈఓ, డీడీ పోస్ట్లు నింపటానికి ప్రమోషన్ పద్ధతి ఉందన్నారు. ఈ జీవోలో సడలింపులే ఎక్కువ అని, రిజర్వేషన్ తుంగలో తొక్కి అన్యాయం చేస్తూన్నారని వ్యాఖ్యలు చేశారు. అర్హులు లేనపుడు క్యారీఫార్వర్డ్ కావల్సిన ఫోస్టు ఎలా భర్తి చేస్తారని ప్రశ్నించారు. పాఠశాలలో ఒక్కరోజు పని చేయని వారితో ఏ విధంగా పాఠశాలలపై పెత్తనం చేయిస్తారని నిలదీశారు. సర్వీస్ రూల్స్ లేవని అడ్డదారులు వెతుకుతున్నారన్నారు. ఇప్పటికే పాఠశాల విద్య ప్రయోగాల పేరుతో పాడైందని, ఈ జీవో పాఠశాలలపై పెత్తనం చేసే ప్రయత్నమేనని జవహర్ విరుచుకుపడ్డారు.