రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో మూడు రోజుల చొప్పున టీడీపీ – జనసేన ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తాం. నియోజకవర్గాల వారీగా ప్రణాళికల తయారీకి నిర్ణయం తీసుకున్నాం. ఏ నియోజకవర్గంలో ఎప్పుడనేది ఒకట్రెండు రోజుల్లో వెల్లడిస్తాం. ఇప్పటికే భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో ఇంటింటికీ వెళ్తున్నాం. పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ ఇచ్చిన ఐదారు పాయింట్లను కూడా పరిగణనలోకి తీసుకుంటాం. వాటిని ‘భవిష్యత్తుకు గ్యారంటీ’లో కలుపుతాం. రెండు పార్టీలు కలిసి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని చేయాలనుకున్నాం. పార్టీకి ముగ్గురు చొప్పున మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు చేస్తాం. తెదేపా నుంచి యనమల నాయకత్వంలో ముగ్గురు సభ్యులు ఉంటారు. త్వరలోనే నాదెండ్ల మనోహర్ కూడా ముగ్గురి పేర్లను ప్రకటిస్తారు. నవంబరు 13న మొదటి సమావేశం ఏర్పాటు చేసి చర్చించుకుంటాం. 17 నుంచి టీడీపీ-జనసేన కలిసి భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాల్లో పాల్గొంటాయని అచ్చెన్నాయుడు వివరించారు.